మాటెరా.. ఇటలీకి చెందిన ఓ పురాతన నగరం. పెద్ద రాళ్లు, కొండలు, గుహలతో సహజమైన తెలుపు రంగులో కనువిందు చేసే సిటీ ఇది. ఇక్కడే జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టు డై' సినిమాకు సంబంధించి కీలకమైన కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీశారు. ఇప్పుడీ లొకేషన్ లోకి ప్రభాస్ ఎంటరయ్యాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం మాటెరా సిటీకి చేరుకుంది యూనిట్. ప్రస్తుతం అక్కడ షూటింగ్ నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఇటలీలోనే నేపుల్స్ సిటీకి యూనిట్ షిప్ట్ అవుతుంది. ఆ తర్వాత రోమ్, బుడాపెస్ట్ లో కూడా షూటింగ్ చేయబోతున్నారు.
సలార్ సినిమా కథకు యూరోప్ కు ఓ బలమైన కనెక్షన్ ఉంది. కేవలం సాంగ్స్ కోసం యూరోప్ వెళ్లలేదు యూనిట్. ఉదాహరణకు నేపుల్స్ సిటీనే తీసుకుంటే, అక్కడ కూడా నైట్ ఎఫెక్ట్ లో భారీ ఎత్తున ఓ యాక్షన్ ఎపిసోడ్ తీయబోతున్నారు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. మరో కీలక పాత్రలో మలయాళ నటుడు పృధ్వీరాజ్ కనిపించనున్నాడు.
సెప్టెంబర్ లో సలార్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే సలార్ ప్రమోషన్లు మొదలవుతాయి.