ప్రభాస్-పూజా హెగ్డే సినిమాకు జాన్ లేదా రాథేశ్యామ్ అనే టైటిల్ లో ఒకటి పెట్టాలనుకున్నారు. ఈ మేరకు ఈ రెండు టైటిల్స్ ను రిజిస్టర్ కూడా చేయించారు. అంతలోనే దిల్ రాజు తన సినిమాకు జాను అనే టైటిల్ పెట్టేయడంతో ఇక మేకర్స్ వద్ద రాథేశ్యామ్ అనే టైటిల్ మాత్రమే మిగిలింది. ఫ్యాన్స్ కూడా అదే టైటిల్ ను వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడదే టైటిల్ అఫీషియల్ అయింది. రాథేశ్యామ్ టైటిల్ తో ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
టైటిల్ కు తగ్గట్టు ఫస్ట్ లుక్ ను క్లాసీగా ఉంది. ప్రభాస్-పూజా హెగ్డే డాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు. నిజానికి ఫస్ట్ లుక్ లో భాగంగా కేవలం ప్రభాస్ స్టిల్ మాత్రమే వస్తుందని అంతా అనుకున్నారు. మేకర్స్ మాత్రం తమ సినిమా థీమ్ ను దృష్టిలో పెట్టుకొని ఇలా రొమాంటిక్ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదలచేశారు.
రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.
సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుందని పోస్టర్ లో ప్రకటించిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ పేరును మాత్రం అఫీషియల్ గా ప్రకటించలేదు.