ఓ పెద్ద డిసప్పాయింట్ మెంట్ లేదా ఓ భారీ ట్రోలింగ్ నుంచి ఫ్యాన్స్ ను డైవర్ట్ చేయడం మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరి చేతిలోకి సోషల్ మీడియా వచ్చేసిన ఈ రోజుల్లో.. ఓ అంశాన్ని ప్రజలు మరిచిపోయేలా చేయడం చాలా పెద్ద పని. అలాంటి క్లిష్టమైన పనిని చాలా ఈజీగా చేసేశాడు ప్రభాస్.
ప్రభాస్ రీసెంట్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు, సామాన్య ప్రేక్షకుల్ని కూడా నిరాశపరిచింది. పైపెచ్చు వివాదాలు కూడా ముసురుకున్నాయి. ఈ సినిమా యూనిట్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఆదిపురుష్ అంగీకరించి ప్రభాస్ తప్పుచేశాడంటూ సోషల్ మీడియాలో వారం రోజుల పాటు చర్చోపచర్చలు జరిగాయి.
ఇలాంటి పెద్ద డిస్కషన్ కు చాకచక్యంగా ఫుల్ స్టాప్ పెట్టాడు ప్రభాస్. ఎప్పుడైతే ఆదిపురుష్ మిస్ ఫైర్ అయిందని గ్రహించాడో, ఆ వెంటనే సలార్ అప్ డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆదిపురుష్ థియేటర్లలోకి వచ్చిన వారం రోజులకే సలార్ సందడి మొదలైపోయింది. తాజాగా టీజర్ కూడా విడుదల చేశారు.
దానికి కొనసాగింపుగా ఇప్పుడు ప్రాజెక్ట్-కె హంగామా కూడా మొదలైపోయింది. శాన్ డియాగో కామిక్ కాన్-2023లో ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈనెల 21న ఈ హంగామా మొదలుకాబోతోంది.
ఇలా సక్సెస్ ఫుల్ గా ఆదిపురుష్ నుంచి సలార్ కు, అట్నుంచి అటు ప్రాజెక్టు-కె సినిమాకు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ను మళ్లించాడు ప్రభాస్. దీంతో ఇప్పుడంతా సలార్ లేదా ప్రాజెక్ట్-కె గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఆదిపురుష్ పూర్తిగా పక్కకెళ్లిపోయింది. ఒకేసారి 2-3 సినిమాలు చేస్తే ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్నమాట.