Advertisement

Advertisement


Home > Movies - Movie News

సరికొత్త కాంబినేషన్ సినిమాలో అరుదైన కలయిక

సరికొత్త కాంబినేషన్ సినిమాలో అరుదైన కలయిక

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా. చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఇదే ఎంతో కొత్త కాంబినేషన్ అనుకుంటే, ఈ సినిమా ఓపెనింగ్ లో ఇంతకంటే కొత్త కాంబినేషన్ ఒకటి కనిపించింది. అదే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కలయిక. ఈ అరుదైన కలయికే ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్.

అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ హీరోగా నటించే కొత్త సినిమా ఈరోజు లాంఛ్ అయింది. ఈ ఓపెనింగ్ కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. అయితే పవన్ రాక కంటే.. ప్రకాష్ రాజ్-మంచు విష్ణు కలయిక అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఇద్దరూ చేతులు కట్టుకొని నవ్వుతూ మాట్లాడుకోవడం ఇంకా నచ్చింది. ఇది ఎందుకు ఇంత అరుదైన కలయికగా మారిందనేది చాలామందికి తెలిసిందే.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ను ఓడించాడు మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ సపోర్ట్ ఇవ్వగా, మంచు విష్ణు వెనక సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ నిలబడ్డారు. అన్నీ తానై మంత్రాంగం నడిపి విష్ణుని, అధ్యక్షుడ్ని చేశారు. ఈ క్రమంలో విష్ణు-ప్రకాష్ రాజ్ మధ్య మాటలయుద్ధం ఓ రేంజ్ లో జరిగింది.

లోకల్-నాన్ లోకన్ అనే ఎజెండా నుంచి వ్యక్తిగత స్థాయిలో దూషించుకోవడం వరకు వెళ్లింది వ్యవహారం. వెండితెరపై కూడా పండనంత డ్రామా 'మా' ఎన్నికల్లో పండింది. ఆ ఎన్నికల్లో ఓడిన వెంటనే తన సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. అక్కడితో ఆగలేదు. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫూటేజీ కావాలన్నారు. దానిపై ఇంకొన్ని రోజులు రగడ కొనసాగింది. ఇలా చాన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య వైరం నడిచింది.

మళ్లీ ఇన్ని రోజులకు వీళ్లిద్దరూ ఇలా కలుసుకున్నారు. కలిసి నవ్వుతూ మాట్లాడుకున్నారు. అర్జున్-విశ్వక్ సేన్ సినిమా ఓపెనింగ్ వీళ్లిద్దర్నీ ఇలా కలిపింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?