‘మా’లో భయానక వాతావరణం

మా ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటికి నిన్న మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేసారు.  Advertisement అక్కడితో ఆగిపోతుంది, వ్వవహారం సద్దుమణుగుతుంది అనుకుంటే మళ్లీ మరోసారి మీడియా ముందుకు వచ్చింది…

మా ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటికి నిన్న మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేసారు. 

అక్కడితో ఆగిపోతుంది, వ్వవహారం సద్దుమణుగుతుంది అనుకుంటే మళ్లీ మరోసారి మీడియా ముందుకు వచ్చింది ప్రకాష్ రాజ్ ప్యానల్. ఈసారి ఇలా రావడం వెనుక కొత్త యూనియన్ ఆవిర్భావం వుందని ముందే వార్తలు వచ్చాయి. ఆత్మ అనే టైటిల్ కూడా వచ్చింది.

అయితే ఇదేదీ మీడియా మీట్ లో బయటకు రాలేదు. ఆత్మ..పరమాత్మ..ప్రేతాత్మ లాంటి వ్యవహారాలు ఏవీ లేవని ప్రకాష్ రాజ్ కొట్టి పారేసారు. కానీ సరికొత్త గేమ్ ప్లాన్ కు చెర లేచింది. గెలిచిన సభ్యులు అందరూ తమ తమ పదవులకు రాజీనామా ప్రకటించారు.

దానికి వారు చెప్పిన కారణం సహేతుకంగానే వుంది. ఇరు వర్గాలు మా లో అధికార, ప్రతిపక్షాలుగా వుంటే భవిష్యత్ లో పనులు జరగకపోతే, తాము సహకరించలేదని అనే ప్రమాదం వుంది. 

విష్ణు ప్యానల్ విడుదల చేసిన మ్యానిఫెస్టో సక్రమంగా అమలు జరగాలి. అదే ఆలోచనతో వారికి అడ్డం పడకుండా, వారికి స్వేచ్ఛగా పని చేయడానికి వీలుగా ఈ రాజీనామాలు చేస్తున్నాం అన్నారు.

అక్కడితో ఆగలేదు. పోలింగ్ నాడు మోహన్ బాబుతో, విష్ణు ఎదురయిన అనుభవాలను సభ్యులు వెల్లడించారు. మోహన్ బాబు తనను బూతులు తిట్టారంటూ నటుడు బెనర్జీ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. 

విష్ణు అరిచిన అరుపులు దారుణం అని మరో నటుడు ప్రభాకర్ చెప్పారు. పైకి చెప్పలేము కానీ మా లో పని చేసే వాతావరణం వుంటుందని తాము అనుకోవడం లేదన్నారు. 

తమ భయాలు తమకు వున్నాయన్నారు. అందుకే రెండేళ్ల పాటు మా పదవులకు దూరంగా వుంటూ,. ప్రశ్నించడం బాధ్యతగా తీసుకుంటున్నామన్నారు.

సభ్యులు ఎక్కువగా నరేష్ ను, మోహన్ బాబును టార్గెట్ చేయడం విశేషం. అలాగే మంచు మనోజ్ ఆ రోజు అక్కడ గొడవలు జరగకుండా ఆపడం పై ప్రశంసలు కురిపించడం విశేషం. మొత్తం మీద మా సమావేశాల్లో పాల్గొనాలంటే భయపడుతున్నాం అని చెప్పకనే చెప్పారు.