డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసే దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన కథలు, కాన్సెప్ట్ లు మారకుండా, దానికి తగిన హీరోను తీసుకుని సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి డైరక్టర్ ఇప్పుడు ఏకంగా నందమూరి బాలకృష్ణతో సినిమా అంటే ఎలా వుంటుంది?.
బాలయ్య యేమో ఊర మాస్ సినిమాలు. ఈయనవేమో కొత్త కొత్త ఐడియాలు. బాలకృష్ణతో సినిమా కోసం నిర్మాత సుధాకర్ చెరుకూరి నుంచి కోటి రూపాయల అడ్వాన్స్ చాలా అంటే చాలా కాలం కిందటే అందుకున్నాడు.
ఈ అడ్వాన్స్ ఎందుకుంటే బాలయ్యతో సినిమా కోసం. బాలయ్య-బోయపాటి లేదా బాలయ్య-ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా చేయాలని నిర్మాత సుధాకర్ ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమా కు ఒక్కో సూపర్ హీరో క్యారెక్టర్ ను తయారు చేసి, అన్నీ అయ్యాక అవెంజర్స్ మాదిరిగా ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలనే ఆలోచనలో వున్నారు. మరి బాలయ్యతో ఎలాంటి క్యారెక్టర్ వర్కవుట్ చేస్తారో చూడాలి.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా మీద వున్నారు. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా మీద వున్నారు. బాలయ్య-బోయపాటి సినిమా చేయాల్సి వుంది. దాని కన్నా ముందు ఓ సిన్మా చేసే ఆలోచనలో వున్నారు. అది ప్రశాంత్ వర్మ సినిమానే కావచ్చు.