ప్రస్తుతం షూటింగ్ కు పాజ్ రావడంతో హీరో విజయ్ లీజర్ గా వున్నారు. సరదా టూర్ లు వేస్తున్నారు. కథలు వింటూ, డైరక్టర్లతో డిస్కషన్లు సాగిస్తున్నారు. పనిలో పనిగా సినిమా ఫంక్షన్ లకు కూడా రాబోతున్నారు.
శివకార్తికేయన్ హీరోగా తయారైన ప్రిన్స్ సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ రాబోతున్నాడు. జాతిరత్నాలు సినిమా అందించిన అనుదీప్ ఈ సినిమా దర్ళకుడు. ఆసియన్ సునీల్ నిర్మాత.
ఫుల్ మాస్ ఫన్ ఎంటర్ టైనర్ గా తయారైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం జరగబోతోంది. ఈ ఫంక్షన్ లో రిలీజ్ ట్రయిలర్ ను విజయ్ విడుదల చేస్తారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ప్రిన్స్ సినిమాలో మారియా హీరోయిన్ గా సత్యరాజ్ కీలకపాత్రల్లో నటించారు.
ఇండియన్ కుర్రాడు విదేశీ అమ్మాయితో ప్రేమలో పడితే వచ్చే సమస్యలను ఫన్ జోడించి చిత్రీకరించిన సినిమా ఇది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించిన సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఇందులో ఓ పాట బాగా వైరల్ అయింది. దగ్గుబాటి సురేష్ బాబు సినిమాకు సమర్పకుడు.