Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రియాంక చోప్రా చీర రేటు ఎంతో తెలుసా?

ప్రియాంక చోప్రా చీర రేటు ఎంతో తెలుసా?

అయోధ్యలోని భవ్య రామమందిరంలో కొలువుదీరిన బాలక్ రామ్ ను తాజాగా దర్శించుకుంది హీరోయిన్ ప్రియాంక చోప్రా. పసుపు రంగు సంప్రదాయ చీరలో ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ఆమె కట్టుకున్న చీర సింపుల్ గా ఉంది. ప్రియాంక చోప్రా చాలా సింపుల్ గా ఉందంటూ అంతా పోస్టులు పెట్టారు.

కానీ అంతా అనుకుంటున్నట్టు ప్రియాంక చోప్రా ధరించిన ఆ చీర అంత సింపుల్ కాదు. దాని ఖరీదు అక్షరాలా 63,800 రూపాయలు. ప్రియాంక చోప్రా కోసం 10 రోజుల ముందు నుంచే ఈ చీరను డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ చీర కోసం పూర్తిగా ఆర్గానిక్ మెటీరియల్ ను ఉపయోగించారట. వాడిన ఫ్యాబ్రిక్ తో పాటు, రంగులు కూడా అన్నీ ఆర్గానిక్ వే. చర్మానికి ఎలాంటి హానీ తలపెట్టని మెటీరియల్ ఇది.

తన భర్త, కూతురు మేరీ జోనస్ తో కలిసి రామమందిరానికి వచ్చింది ప్రియాంక చోప్రా. ఆమెను తమ కెమెరాల్లో బంధించేందుకు భక్తులు ఎగబడ్డారు. ప్రియాంక చోప్రా మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయానికి వచ్చి, దేవుడ్ని దర్శించుకుంది. పూజారిని అడిగి మరీ తన భర్తకు నుదుటిపై బొట్టు పెట్టించింది.

మీరా చోప్రా పెళ్లి కోసం ఇండియాకు వచ్చింది ప్రియాంక చోప్రా. ఈ గ్యాప్ లో తన బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్ ను కలవడంతో పాటు, దశాబ్దాల తర్వాత కొలువుదీరిన రాముడ్ని కూడా దర్శించుకుంది. త్వరలోనే భర్త, పిల్లలతో కలిసి ఆమె లాస్ ఏంజెలస్ కు వెళ్లనుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?