Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రాజెక్ట్ కల్కి... ఆంధ్ర 100 కోట్లు

ప్రాజెక్ట్ కల్కి... ఆంధ్ర 100 కోట్లు

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా ప్రాజెక్ కె/కల్కి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు వున్నాయి. నాగ్ అశ్విన్ అంటే మంచి నమ్మకం వుంది. ఏదో సమ్ థింగ్ కొత్తగా ఆలోచించి, ప్రేక్షకుల ఊహకు భిన్నంగా తీస్తారని, క్వాలిటీ వుంటుందని నమ్మకం వుంది.

ప్రభాస్ యావరేజ్, ఫ్లాప్ సినిమాలు కూడా మంచి వసూళ్లు కనబర్చాయి. ఇక హిట్ సినిమా అంటే చెప్పనక్కరలేదు. అందువల్ల ఈ సినిమాకు మంచి రేట్లు కోట్ చేస్తున్నారు.

నైజాం ఏరియాను 62 కోట్ల మేరకు అడ్వాన్స్ మీద ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఏరియాను మాత్రం నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ను ట్రయ్ చేస్తున్నారని సమాచారం. రెండో భాగం వుంది కనుక, కాస్త తగ్గినా అందులో సర్దుబాటు చేస్తారనే భరోసా వుంటుంది. అందుకే ఈ మేరకు ఎంక్వయిరీలు బాగానే వస్తున్నాయి. ఉగాదికే కొన్ని మాట మాత్రంగా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ మార్కెట్ వుంది ప్రాజెక్ట్ కల్కికి. రానా ఈ విషయంలో కీలకంగా పని చేస్తున్నారు. అయినా తెలుగు రాష్ట్రాలు కూడా కీలకం. బాహుబలి తరువాత ప్రభాస్ కు ఆ రేంజ్ హిట్ మళ్లీ ప్రాజెక్ట్ కల్కి కావచ్చు.  దీని తరువాత రెండో భాగం వుంది. సందీప్ వంగా స్పిరిట్ సినిమా వస్తుంది. అలాగే సలార్ రెండో భాగం వుంది. ఇవి కాక మారుతి డైరక్షన్ లో రాజా సాబ్ సినిమా వుంది. మొత్తం మీద ప్రభాస్ డైరీ 2026 చివరి వరకు ఫుల్ అయిపోయినట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?