పూజా అరెస్ట్ కు రంగం సిద్ధం?

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఏ క్షణానైనా పూజా…

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఏ క్షణానైనా పూజా ఖేడ్కర్ అరెస్ట్ అవ్వొచ్చు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అవకతవకలకు పాల్పడ్డారనేది పూజాపై ఆరోపణ. పూజ సమర్పించిన బోగస్ సర్టిఫికేట్ పై చర్యలు తీసుకున్న కమిషన్, ఆమె ట్రైనీ ఐఏఎస్ పోస్టును ఉపసంహరించుకుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఆమె యూవీఎస్సీ నిర్వహించే ఏ రకమైన పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించింది.

యూపీఎస్సీకి నకిలీ అంగవైకల్య ధృవీకరణ పత్రం సమర్పించారనే ఆరోపణలపై పూజా కేడ్కర్ పై కేసు నమోదైంది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె ముందస్తు బెయిల్ కు అప్లయ్ చేసుకున్నారు. అది తిరస్కరణకు గురవ్వడంతో, పూజాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమౌతున్నారు.

ఐఏఎస్ గా సెలక్ట్ అయ్యేందుకు యూపీఎస్సీలో కొందరు వ్యక్తులు ఆమెకు సహాయం చేశారనే ఆరోపణలున్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ సాగించబోతున్నారు.

మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా కేడ్కర్, తనకుతానుగా ఇరుక్కున్నారు. పూర్తిస్థాయి ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించకముందే, ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. లగ్జరీ కారును వాడడం, ప్రోటోకాల్ ను కోరుకోవడం, ఆమెను ఇరకాటంలో పెట్టాయి. దీనికితోడు ఆమె తల్లి తుపాకీతో రైతుల్ని బెదిరించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది.

ఓవైపు ఇదంతా నడుస్తుండగానే, మరోవైపు పూజా ఖేడ్కర్ సమర్పించిన పత్రాలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ తర్వాత ఆమె ఐఏఎస్ పోస్టింగ్ ను రద్దు చేసింది. ఆ తర్వాత కేసు పెట్టింది.

మరోవైపు పూజా ఖేడ్కర్ కేసుతో వికలాంగుల హక్కుల చట్టంలో మార్పుచేర్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇకపై వికలాంగ ధృవీకరణ పత్రాలు తప్పుదోవ పట్టకుండా ఉండేలా, మరింత పకడ్బందీగా నిబంధనల్ని రూపొందించేందుకు ఆర్పీడబ్ల్యూడీ-2016 చట్టంలోని నిబంధనల్ని సవరించేందుకు ముసాయిదాను ప్రచురించింది. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రాబోతున్నాయి.

11 Replies to “పూజా అరెస్ట్ కు రంగం సిద్ధం?”

  1. 1995 లొ Sr. NTR కి వెన్నుపోటు…C.M కుర్చి కొటెచిండు 

    1999 BJP పుణ్యం ( కార్గిల్ యుద్ధం)

    2014 Modi/P kalyan దయ 

    2024 Modi/P kalyan దయ

    ఇంత మంది జాకీ వేస్తేకాని అక్కడ లేవదు

    జనం మెచ్చినా లీడర్ జగన్. వెన్నుపోటు తో గెలిచినా లీడర్ కాదు

    1. తం*డ్రి బతి*కి వుంటే, తనని బెంగ*ళూర్ దాటి రానివ్వకుండా బ్యా*న్ చేశాడు అని అతని బ*తికి వుంటే తనకి సి*ఎం అయ్యే ఛాన్స్ రాదు అని,

      మన దేశ రాజకీయాల్లో తం*డ్రి మ*రణిస్తే సాను*భూతి తో కొడు*క్కి ప*దవి ఇస్తారు అనే ప్లాన్ తో తం*డ్రి నే ప్లా*న్ వేసి లేపే*సి, సి*ఎం పదవి కోసం ట్రై చేసినా కొడుకు.

      సోని*యా కి ఆ సం*గతి తెలిసి పోయి అప్పట్లో సి*ఎం పదవి ఇవ్వలేదు.

      పదవి కోసం ఏకంగా తం*డ్రి నీ లేపేసాడు.

      చిన్నా*న్న నీ లేపేశాడు.

      త*ల్లి నీ తరిమేశాడు.

      చె*ల్లి ఆస్తులు కాజీసాడు.

      దేము*డు దగ్గర కూడా అబద్ధం కాసేపు గొ*ర్రె బిడ్డ*ని అని అంటాడు, మరల హిందూ భక్తుడి వేషం వేస్తాడు.

      కోడి*కట్టి డ్రా*మా వేశా*డు

      ఇంతకన్నా యె*బ్రాసి వెధ*వ పెపంచం లో ఎవడైనా వుంటాడా ?

  2. ఎంత మంది ఇలా ఐఏఎస్ లు అయిపోయార్రా …

    లేడీస్ రిజర్వేషన్, ఎకనామిక్ backward రిజర్వేషన్ … ఇంత మొద్దు , పనికిరాని జనాలని ఐఏఎస్ లు అయిపోయే సిస్టం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది . అంత వీక్ ఆర్గనైజషనా upsc ?? అయితే ఈ బీహార్ నుండి పోలో మని వచ్చే ఆ ఐఏఎస్ లు అందరూ ఇదే బాపతు అన్నమాట .

  3. జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు . 

    ప్రతి సంవత్సరం 800 కోట్ల k-బ్యాచ్ స్వాహా

  4. వెన్నుపోటు వాలంటీర్లకు. వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

  5. ఈవీఎం లు మేనేజ్ చేసి సీఎం అవ్వొచ్చు కానీ అవక తవక లకి పాల్పడి ఐఏఎస్ అవడం దారుణం…

  6. స్వాతంత్ర్యం ముందు నుంచే ఈ సర్కారీ వ్యవస్త ఉండేది.. ఇవి బ్రిటిష్ వారు వారి దోపిడి కోసం సృష్టించుకున్నవి.. మన దేశం ఈ రోజు ఎలా ఎక్కడ ఉందో అవస్త చూస్తే ఈ వ్యవస్త అసలు ఉండాలా.. అవసరం ఉందా లేదా అనే ఆలోచన తప్పక వస్తుంది ..

Comments are closed.