Advertisement

Advertisement


Home > Movies - Movie News

తడిసిన అందాలు.. బిగ్ బాస్ పై రివర్స్

తడిసిన అందాలు.. బిగ్ బాస్ పై రివర్స్

బిగ్ బాస్.. పేరులోనే అర్థమంతా ఉంది. అతడు చెప్పింది చేయాల్సిందే. లేదంటే హౌజ్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అల్టిమేట్ పవర్ బిగ్ బాస్ దే. కానీ ఈసారి బిగ్ బాస్ కే ఝలక్ తగిలింది. ఇప్పటివరకు ఎన్నడూ జరగని విడ్డూరం నిన్న రాత్రి బిగ్ బాస్ హౌజ్ లో చోటు చేసుకుంది. కంటెస్టెంట్ పునర్నవి, బిగ్ బాస్ చెప్పిన మాటల్ని పట్టించుకోలేదు. అతడిచ్చిన గేమ్ ఆడనంటూ రివర్స్ అయింది. పనిలో పనిగా బిగ్ బాస్ ను ఏకి పడేసింది.

నిన్న హౌజ్ లో ఓ కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కొందర్ని దెయ్యాలుగా మార్చి, మిగతావాళ్లను చంపాలనేది ఆ టాస్స్. ఎవరైతే ఎదుటి వ్యక్తిని బిగ్ బాస్ చెప్పినట్టు మార్చేస్తారో వాళ్లు తిరిగి మనుషులుగా మారతారు. అవతలి వ్యక్తులు తిరిగి దెయ్యాలుగా మారతారు. గేమ్ లో భాగంగా పునర్నవిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేయాలి. అంతా కలిసి అదే పనిచేశారు.

దీనిపై పునర్నవి కాస్త హర్ట్ అయింది. చాలాసేపు స్విమ్మింగ్ పూల్ లో ఉండిపోయింది. ఎట్టకేలకు ఆమె స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో శిల్పా చక్రవర్తి ఆమెను స్విమ్మింగ్ పూల్ లోకి తోసేయడంతో ఇక పునర్నవి ఆపుకోలేకపోయింది. ఇంత చెత్త గేమ్ తానెక్కడా చూడలేదంటూ బిగ్ బాస్ పై ఫైర్ అయింది పునర్నవి.

మీ గేమ్ మీరే ఆడుకోండి. నేను చేయను.. ఏం చేస్తారో చేసుకోండంటూ బిగ్ బాస్ పై రివర్స్ అయింది. ఇవాళ్టి ఎపిసోడ్ లో పునర్నవిపై బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఈసారి ఎలిమినేషన్ రౌండ్ లో పునర్నవి వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?