రొమాంటిక్.. అంటూ తనయుడి కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం లేదు. అయితే ఈ సినిమా వెనుక మాత్రం ఆయనే ఉన్నారు. ఆ విషయం ఫస్ట్ లుక్ తోనే స్పష్టం అవుతోంది. పూరీ మార్కు రొమాంటిక్ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.
దశాబ్దంన్న కిందట ఇడియట్ సినిమా టైటిల్ లోగోలో హీరో రవితేజ, ఆ సినిమా హీరోయిన్ రక్షితను కౌగిలించుకున్న స్టిల్ చూసే చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే అప్పటికీ ఇప్పటికీ రోజులు మారాయి. అందుకే ఏకంగా పూరీ ఈసారి హీరోహీరోయిన్లను నగ్నంగా నిలబెట్టేశాడు.
రొమాంటిక్ అంటూ ఈ సినిమా టైటిల్ పెట్టినందుకు అన్వయంగా అలా కౌగిలింతతో మొదలుపెట్టినట్టుగా ఉన్నాడు పూరీ. అయితే.. ఇది రొమాంటిక్ గా లేదు. ఇందులో రొమాన్స్ కన్నా కాంక్షే ఎక్కువగాకనిపిస్తున్నట్టుగా ఉంది.
హీరోయిన్ ని టాప్ లెస్ గా చూపించేసి గట్టిగా కౌగిలింపజేస్తే తప్ప రొమాన్స్ పండించలేని స్థితికి చేరుకున్నట్టుగా ఉన్నారు తెలుగు సినిమా వాళ్లు అనే విషయాన్ని కూడా ఈ సినిమా స్టిల్ చాటి చెబుతూ ఉంది. అంతకు మించి దీని గురించి మాట్లాడుకునేందుకు ఇంకేముందబ్బా? ఇలాంటి ఫొటోలను చాలామంది ఐటమ్ భామలు రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేస్తూనే ఉన్నారుగా.. కొత్తగా ఇదెందుకో!