cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లా...వ‌ద్దు బాబోయ్ అంటున్న న‌టి

పెళ్లా...వ‌ద్దు బాబోయ్ అంటున్న న‌టి

యుక్త వ‌య‌స్సు వ‌చ్చిన త‌ర్వాత స‌హ‌జంగానే పెళ్లిపై మ‌ధుర ఊహ‌ల్లో తేలియాడుతుంటారు. త‌మ‌కు కాబోయే వాడు అలా ఉండాలి, ఇలా ఉండాల‌ని అమ్మాయిలు....అదే స‌మ‌యంలో అబ్బాయిలు కూడా క‌ల‌లు కంటుంటారు. అయితే పెళ్లంటే ఓ న‌టి భ‌యంతో వ‌ణికిపోతోంది. దానికి కార‌ణం లేక‌పోలేదు.

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం చిత్రాల్లో న‌టించిన పూర్ణ, పెళ్లి ప్ర‌స్తావ‌న తెస్తే చాలు నిలువునా కంపిస్తోంది. పెళ్లి పేరుతో ఇటీవ‌ల ఓ ముఠా ఆమెను మోసం చేసిన వ్య‌వ‌హారం సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయిన విష‌యం తెలిసిందే. మోస‌గాళ్ల‌ను క‌ట‌క‌టాల పాలు చేశారు. ఈ నేప‌థ్యంలో పెళ్లంటేనే పూర్ణ‌కు ఒక ర‌క‌మైన విర‌క్తి, అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డింది.

ఈ సంద‌ర్భంగా పూర్ణ మాట్లాడుతూ పెళ్లిపై త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. త‌న‌కు పెళ్లి చేసేందుకు త‌ల్లిదండ్రులు వ‌రుడి కోసం వెతుకులాట మొద‌టు పెట్టార‌న్నారు. ఇదే సంద‌ర్భంలో ఓ ముఠా త‌న త‌ల్లిదండ్రుల‌ను సంప్ర‌దించింద‌న్నారు. ఇరువైపుల పెద్ద‌లు మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ చేశాయ‌న్నారు. పెళ్లి అనంత‌ర జీవితం గురించి చ‌ర్చించేందుకు కాబోయే వాడితో చ‌ర్చించిన‌ట్టు పూర్ణ తెలిపారు.

ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు త‌న‌కు షాక్ ఇచ్చాయ‌న్నారు. ఆ ముఠా త‌మ‌తో ప్రేమ‌గా, అభిమానంగా వ్య‌వ‌హ‌రించి తీవ్ర మోసం చేసిన‌ట్టు పూర్ణ ఆవేద‌న‌తో చెప్పుకొచ్చింది.  ఆ విష‌యం గురించి ఆలోచిస్తేనే భ‌య‌మేస్తుంద‌న్నారు.  అస‌లు ఎవిరిని న‌మ్మాలో, ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో అర్థం కావ‌డం లేద‌ని ఆవేద‌న‌తో చెప్పుకొచ్చింది.

ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోలేన‌ని తెలిపారు. దీంతో  ఇప్పట్లో  వివాహం చేసుకోవ‌ద్ద‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుని, ఆ విష‌యాన్ని త‌న  తల్లిదండ్రులతో కూడా చెప్పిన‌ట్టు పూర్ణ తెలిపారు.  వివాహం అంటేనే త‌న‌కు భ‌య‌మేస్తోంద‌న్నారు. ఆ భ‌యంక‌ర పీడ క‌ల నుంచి కోలుకుని న‌ట‌న‌పై దృష్టి సారిస్తున్న‌ట్టు నటి పూర్ణ వెల్ల‌డించారు. 

లోకేష్ ని చూస్తే వణుకు వచ్చేస్తుంది

కత్తి మహేష్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ

 


×