టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా వస్తోంది అంటే అనేక వార్తలు వినిపిస్తుంటాయి. అది కామన్. పుష్ప 2 విషయంలో అలా వినిపిస్తున్న అంకెలు వింటుంటే ‘వావ్’ అనాలో..’అమ్మో’ అనాలో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే అంత భారీ అంకెలు వినిపిస్తున్నాయి.
పుష్ప 2 సినిమాకు బడ్జెట్ నాలుగు వందల నుంచి అయిదు వందల కోట్లు అన్నది ఫస్ట్ వినిపిస్తున్న అంకె. కనీసం 100 కోట్ల లాభం టార్గెట్ అన్నది మరో అంకె.
హీరో బన్నీకి 100 కోట్ల రెమ్యూనిరేషన్ 30 శాతం లాభాల్లో వాటా అన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టా. దర్శకుడు సుకుమార్ కు 25 కోట్ల రెమ్యూనిరేషన్ 30 శాతం లాభాల్లో వాటా అన్నది ఇంకో పాయింట్. నిర్మాతలకు 40శాతం వాటా అన్నమాట.
అంటే ఈ లెక్కన తెలుగులో హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ అందుకోబోతున్న హీరో బన్నీనే. ఎందుకంటే వంద కోట్ల రెమ్యూనిరేషన్ ప్లస్ థర్టీ పర్సంట్ వాటా అంటే కనీసం 130 కోట్ల వరకు వుండొచ్చు. ఈ ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్ జరిగే పుష్ప 2 విడుదల 2023 చివర్న లేదా 2024 సంక్రాంతి/సమ్మర్ కు వుండొచ్చు అని తెలుస్తోంది.