అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప హిందీ విడుదల సమస్యలో పడిందని తెలుస్తోంది. పుష్ప సినిమాను పాన్ ఇండియా సినిమాగా, ఇంత భారీ సినిమాగా అనుకోకముందుగానే మైత్రీ మూవీస్ సంస్థ హిందీ డబ్బింగ్ హక్కులను అలవాటు ప్రకారం విక్రయించేసారు.
తీరా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిన తరువాత హిందీ హక్కులు కొనుక్కున్న వ్యక్తి థియేటర్ విడుదలకు అంగీకరించడం లేదు.
దీంతో హీరో బన్నీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది,. దాంతో మైత్రీ అధినేతలు హిందీ డబ్బింగ్ కొనుక్కున్న వ్యక్తితో డిస్కషన్లు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని షరతుల మీద హిందీ విడుదలకు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. కానీ అలా చేయడం వల్ల ఆదాయం ఎలా వుంటుందో అన్నది సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి మైత్రీ మూవీస్ కు అదనపు వ్యయం తప్పదని తెలుస్తొంది.
పబ్లిసిటీ, థియేటర్ ఎక్స్ పెండిచర్ మైత్రీ మూవీస్ నే పెట్టుకుని, పర్సంటేజ్ ఇస్తే థియేటర్ విడుదలకు అంగీకరిస్తానని డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ దిశగా డిస్కషన్లు సాగుతున్నాయి. అవి ఫలిస్తే హిందీ విడుదల వుంటుంది.లేదూ అంటే అగ్రిమెంట్ ప్రకారం యూ ట్యూబ్ లో విడుదల అవుతుంది.