ప్రతిరోజూ పండగే సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. విడుదలకు ఇంకా రెండు నెలలు టైమ్ వుంది. కానీ ఈ లోగానే సినిమా టీజర్ వచ్చేసింది. టీజర్ అంటే టీజర్ కాదు. టీజర్ లాంటిది. సినిమా హీరో సాయితేజ్ బర్త్ డే సందర్భంగా డైరక్టర్ మారుతి ఓ వన్ మినిట్ వీడియో కట్ చేసి, బర్త్ డే విసెష్ కింద వదిలారు.
ఎలా వదిలినా? ఎందుకు వదిలినా? ఏ సందర్భంగా వదిలినా? ఇది అచ్చంగా టీజర్ మాదిరిగానే వుంది. మారుతి తొలిసారి చేస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ ఎలా వుండబోతోందో? ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారో? అన్నది కళ్లకు కట్టినట్లు చూపించేసింది.
ముందు నుంచి అందరికి తెలిసినట్లే తాత మనవడు అనుబంధాలతో పాటు, తండ్రి కొడుకు, పెద్ద సంఖ్యలో కుటుంబసభ్యులు ఇతరత్రా వ్యవహారం కళ్లకు కట్టినట్లు కనిపించేలా చూపించేసారు. అంతే కాదు, చిన్ని చిన్న ఆనందాలు, అనుబంధాలు అన్నట్లు కట్ షాట్లు వేసారు.
మొత్తం మీద హీరోకి శుభాకాంక్షలు చెప్పే సందర్భాన్ని వాడుకుని, సైలెంట్ గా సినిమా మొత్తం ఎలా వుండబోతోందో ఎట్ ఎ గ్లాన్స్ చూపించేసారు దర్శకుడు మారుతి. ఈ సినిమాకు గీతా-యువి సంస్థలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాయి. బన్నీవాస్, యువి వంశీ నిర్మాతలు.