దర్శకుడు బోయపాటికి ఓ మార్క్ వుంది. ఎమోషనల్ యాక్షన్ స్టయిల్ వుంది. ఈ రెండూ కలిసి వదిలినట్లు వుంది రామ్ పోతినేని సినిమా టీజర్.
పవర్ ఫుల్ డైలాగు, పవర్ ఫుల్ యాంబియన్స్, హీరో యాటిట్యూడ్ అన్నీ కలిసి టీజర్ ను బలంగా ప్రెజెంట్ చేసాయి. చాల కలర్ ఫుల్ గా వుంది టీజర్. బలమైన రౌడీలు, బలమైన దున్నపోతును పట్టుకుని, నడిచివచ్చే హీరో, చిన్న యాక్షన్ కట్ అన్నీ చోటు చేసుకున్నాయి ఇందులో.
థమన్ మాంచి మాస్ బీజీఎమ్ అందించాడు. రామ్ పోతినేని ని షార్ట్ కట్ లో రా.పో అని అలవాటు చేసారు. అదే పదం థీమ్ తో సాంగ్ ను ప్రిపేర్ చేసి నేపథ్యంలో వాడారు. బోయపాటికి ఓ సీన్ ను ఎలా విజువల్ గ్రాండ్ గా మార్చాలో తెలుసు. రకరకాల రంగులు, భారీ దున్నపోతు, దానికి ముకుతాడు వేసిపట్టుకోవడం ఇవన్నీ కలిసి ఇంట్రస్టింగ్ గా మార్చాయి టీజర్ ను.
పవన్ కుమార్, చిట్టూరి శ్రీను సినిమా నిర్మాణంలో ఖర్చుకు వెనుకాడరు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ చెప్పేది అదే. రావడం పోవడం తరువాత ముందు సినిమాకు ఏం కావాలో, ఎంత కావాలో అంతా పెట్టెయ్యడమే. ఈ టీజర్ కూడా ఆ ఖర్చును చూపించేసింది.