రాహు మ్యూజికల్ సెలబ్రేషన్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ కాంబినేషన్ లో సుబ్బు వేదుల అందిస్తున్న సినిమా రాహు. ఓ డిఫరెంట్ పాయింట్ తో తయారవుతున్న థ్రిల్లర్ ఇది. ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో…

కృతి గార్గ్, అభిరామ్ వర్మ కాంబినేషన్ లో సుబ్బు వేదుల అందిస్తున్న సినిమా రాహు. ఓ డిఫరెంట్ పాయింట్ తో తయారవుతున్న థ్రిల్లర్ ఇది. ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సిద్దు శ్రీరామ్ పాడిన ఓ పాటకు మాంచి అప్లాజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ సెలబ్రేషన్ నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు జీవిత రాజశేఖర్ నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డైరెక్టర్ సుబ్బు వేదుల కార్యక్రమంలో మాట్లాడుతూ  ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరో రెండు పాటలు విడుదల కానున్నాయి. మంచి సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారికి ధన్యవాదాలు అన్నారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ రాహు లాంటి చిన్న సినిమా మ్యూజిక్ సక్సెస్ అవ్వడం అరుదుగా చూస్తూ ఉంటాము. జి తెలుగు వారు ఈ చిత్ర శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్  తీసుకోవడం తో ఈ సినిమా సక్సెస్ మొదలైంది అనిపిస్తుంది అన్నారు. 

రాజ్ కందుకూరి మాట్లాడుతూ థ్రిల్లర్స్ బాగా ఆడుతున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో విడుదల కానున్న రాహు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ మధుర శ్రీధర్ ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు, రాహు సినిమా ప్రోమోస్ చూశాను ప్రామిసింగ్ గా ఉన్నాయి డైరెక్టర్ సుబ్బు గారికి చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

నిర్మాత స్వామి మాట్లాడుతూ అంతా కొత్తవారితో తీసిన సినిమా రాహు. అందరి సహకారంతో ఈ సినిమాను పూర్తి చేశాము. ఫిబ్రవరి 28న వస్తోన్న మా సినిమా సక్సెస్ అయ్యి మళ్ళీ ఇలా మీ అందరిని కలవాలని కోరుకుంటున్నామని అన్నారు.

హీరో అభిరామ్ మాట్లాడుతూ రాహు నా మొదటి సినిమా ఈ చిత్ర ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మా సినిమాను విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. అన్నారు. 

రష్మికని దారుణంగా ఆడేసుకున్నారు