రానా..మరో వెబ్ సిరీస్!

రానా నాయుడు వెబ్ సిరీస్ లో ఓటిటిలోకి అడుగు పెట్టాడు హీరో రానా. మళ్లీ మరో వెబ్ సిరీస్ కు ఓకె చెప్పే కార్యక్రమం జరుగుతోందని తెలుస్తోంది. Advertisement రిపబ్లిక్ సినిమా తరువాత ఇప్పటి…

రానా నాయుడు వెబ్ సిరీస్ లో ఓటిటిలోకి అడుగు పెట్టాడు హీరో రానా. మళ్లీ మరో వెబ్ సిరీస్ కు ఓకె చెప్పే కార్యక్రమం జరుగుతోందని తెలుస్తోంది.

రిపబ్లిక్ సినిమా తరువాత ఇప్పటి వరకు మళ్లీ మరో సినిమా స్టార్ట్ చేయలేదు దర్శకుడు దేవా కట్టా. రెండు మూడు స్క్రిప్ట్ లు రెడీ చేసుకున్నారు. వీటిలో ఒకటి వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. గతంలో ఇంద్ర ప్రస్థ అనే పొలిటికల్ వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేసారు. మరి అదే ఇప్పుడు చేయబోతున్నారో, లేదా మరో సబ్జెక్ట్ నో అన్నది తెలియాల్సి వుంది.

ఈ చేయబోయే వెబ్ సిరీస్ లో రానా, ఆది పినిశెట్టి కీలకపాత్రలు పోషిస్తారని తెలుస్తోంది.  ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో వుంది. ఇది అయిన తరువాత మెయిన్ స్ట్రీమ్ సినిమా చేసే ప్రయత్నాల్లో వున్నారు దేవా కట్టా.

వెన్నెల, ప్రస్ధానం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలు, సిద్దాంతాల మీద అవగాహన వున్న దర్శకుడు అనిపించుకున్నారు. రిపబ్లిక్ సినిమా చేసారు. కాస్త పేరు వచ్చింది. 

నిర్మాతకు లాభమే కానీ హడావుడి జరిగినంత, ఆశించిన రేంజ్ కు మాత్రం వెళ్లలేదు. బహుశా అందువల్లే కావచ్చు ఇప్పటి వరకు మరో సినిమా స్టార్ట్ కాలేదు. ఆయనైతే స్క్రిప్ట్ లు చేసుకుంటున్నా అంటున్నారని తెలుస్తోంది.