మొదటిసారి బికినీలో హీరోయిన్ రచ్చ రచ్చ

కెరీర్ స్టార్టింగ్ లో రాశిఖన్నా ఎలా ఉండేదో గుర్తుందా.. బొద్దుగా కనిపించేది. అలాంటి అమ్మాయిని బికినీలో ఊహించుకోవడమే కష్టంగా ఉండేది. కానీ గ్లామర్ ఫీల్డ్ లో బికినీ కూడా ధరించాల్సిందే. అందుకే దీన్ని ఓ…

కెరీర్ స్టార్టింగ్ లో రాశిఖన్నా ఎలా ఉండేదో గుర్తుందా.. బొద్దుగా కనిపించేది. అలాంటి అమ్మాయిని బికినీలో ఊహించుకోవడమే కష్టంగా ఉండేది. కానీ గ్లామర్ ఫీల్డ్ లో బికినీ కూడా ధరించాల్సిందే. అందుకే దీన్ని ఓ ఛాలెంజింగ్ గా తీసుకుంది రాశి. ఏడాదిపాటు కష్టపడి బికినీ బాడీ (బాలీవుడ్ లో బికినీ బాడీ కోసం ట్రయినింగ్ ఇచ్చే వాళ్లు ఉన్నారు) సొంతం చేసుకుంది.

ఎట్టకేలకు తను సొంతం చేసుకున్న స్లిమ్ ఫిజిక్ తో బికినీ వేసుకుంది రాశి. ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ బికినీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం తను ఎంజాయ్ చేస్తున్న స్లిమ్ ఫిజిక్ ను సొంతం చేసుకోవడానికి తనకు ఏడాది టైమ్ పట్టిందని చెప్పుకొచ్చింది రాశి.

“ఫిట్ నెస్ పరంగా ఏడాది పాటు చాలా కష్టపడ్డాను. నా ట్రయినర్ (కులదీప్ సేథి) చాలా స్టడీ చేశాడు. నా కోసం చాలా కష్టపడి ప్రత్యేకమైన వ్యాయామాలు, ఆహార నియమాలు తయారుచేశాడు. దీనికోసం నేను ఏడాదిగా శాకాహారిగా మారిపోయాను. ఎట్టకేలకు నేను అనుకున్నది సాధించాను. ఎలా కనిపించాలనుకున్నానో దాదాపు ఆ షేప్ కు వచ్చేశాను. ఫిట్ అండ్ హెల్దీ బాడీ.”

ఇలా స్లిమ్ ఫిజిక్ కోసం తను పడిన కష్టాన్ని బయటపెట్టింది రాశిఖన్నా. మన శరీరాన్ని అసహ్యించుకోకూడదని, ప్రేమించాలని చెబుతున్న రాశి.. స్లిమ్ గా మారడం కోసం క్రాష్ డైట్స్ పద్ధతిని ఫాలో అవ్వకూడదని హెచ్చరిస్తోంది. అలా చేస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని అంటోంది.

తనలా స్లిమ్ ఫిజిక్ సొంతం చేసుకోవాలనుకునే వాళ్లు ఆరోగ్యకరమైన నియమాలు పాటిస్తూ, ఎక్సర్ సైజులు చేయాలని చెబుతోంది. ప్రస్తుతం రాశిఖన్నా బికినీ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్న లాంటి తారలు కూడా లైకులు మీద లైకులు కొడుతున్నారు. 

Click Here For Photo Gallery

‘ఉప్పెన’ మన నేటివ్‌ కథ

వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ హక్కు చంద్రబాబుదే