నిజంగా ఆమె అందాల రాశి. వెండితెరపై నిండుగా కనిపించే బంగారు బొమ్మ. కానీ ఈ ఉపమానాలన్నీ హీరోయిన్ రాశి విషయంలో ఇప్పుడు వాడలేం అంటున్నారు నెటిజన్లు. దీనికి వాళ్లు ప్రధానంగా చెబుతున్న కంప్లయింట్ రాశి కన్ను. ఆమె ఎడమ కన్నులో ఏదో సమస్య ఉందని, ఆమె అందాన్ని అది దెబ్బతీసిందనేది చాలామంది ఫిర్యాదు. దీనిపై స్వయంగా రాశి స్పందించింది.
“నా గత చిత్రాలతో పోల్చిచూస్తే.. ఎడమ కన్ను, ముక్కు ఏదో తేడాగా ఉందని అంటున్నారు చాలామంది. ఓ విషయం చెప్పాలి. మూవీ మేకోవర్ కు, ఇంట్లో లుక్ కు చాలా తేడా ఉంటుంది. సెట్స్ పై లైటింగ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. షూటింగ్స్ చేసేటప్పుడు వంట పని లేదు. కాబట్టి బాగా నిద్రపోయేదాన్ని. కానీ ఇప్పుడలా కాదు. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. పైగా శుభాకాంక్షలు సినిమాకు ఇప్పటికీ చాలా ఏళ్లు గడిచిపోయాయి. కాబట్టి వయసు వల్ల వచ్చిన మార్పు కావొచ్చు. అంతే తప్ప.. అంతా ఊహించుకునే రేంజ్ లో నాకు కంటి సమస్యలు ఏం లేవు.”
ఇక తన ముక్కు విషయానికొస్తే సినిమాల్లో ఉన్నప్పుడు రాశికి ముక్కుపుడక లేదట. పాప పుట్టినప్పుడు ముక్కు పుడక పెట్టించుకుందట. బహుశా అందువల్ల తన ముక్కు అప్పటికీ ఇప్పటికీ కాస్త తేడాగా కనిపిస్తుందేమోనని అభిప్రాయపడింది రాశి.