భారీ సినిమాలకు ప్రమోషన్ చాలా సులువు. ఎందుకంటే ఫ్యాన్స్ ఆ సినిమాల మీద చాలా ఆసక్తితో వుంటారు కనుక. కానీ అదే సమయంలో ఎప్పటికప్పుడు ఏదో సమ్ థింగ్ ఆ సినిమా నుంచి పబ్లిసిటీ కంటెంట్ బయటకు వస్తూ వుండాలి. లేదూ అంటే ఫ్యాన్స్ రివర్స్ అయిపోతారు.
అభిమానం వస్తే నిర్మాణ యూనిట్ ను నెత్తిన పెట్టేసుకుంటారు. చిన్న మెత్తు తేడా వస్తే రివర్స్ అయిపోతారు. పుష్ప టైమ్ లో మైత్రీ మూవీస్, భీమ్లా కు సంబంధించి సితార ఎంటర్ టైన్ మెంట్స్, రాధేశ్యామ్ కోసం యువి సంస్థ లు ఫ్యాన్స్ ట్రోలింగ్ ను చవిచూసాయి. అప్ డేట్..అప్ డేట్ అన్నది ఫ్యాన్స్ ఆకలి. ఎంత ఇచ్చినా తీరని ఆకలి.
పైగా సినిమా ఇప్పటికే ఒకటికి రెండు డేట్ లు మారింది. డేట్ అనుకున్నపుడల్లా కంటెంట్ ఇస్తూనే వున్నారు. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నిర్మాత సమస్య. అయినా ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకే రాధేశ్యామ్ కోసం కొత్త కంటెంట్ రెడీ చేస్తున్నారు. ఈవారం చివర నుంచి కంటెంట్ విడుదల ప్లాన్ చేస్తున్నారు.
మరో ట్రయిలర్ కట్ చేస్తున్నారు. అలాగే ఓ మేకింగ్ వీడియో తయారు చేయించారు. ఈ రెండూ కాక ఓ పాట కూడా వుంది. రాబోయే మూడు వారాల్లో ఈ కంటెంట్ లు వరుసగా విడుదల చేస్తారు. ఇక ఆపై మీడియా మీట్ లు, ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ హడావుడి వుంటనే వుంటుంది.
పూజాహెగ్డే, ప్రభాస్ జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న థియేటర్లలోకి వస్తుంది.