రాజా సాబ్.. మళ్లీ డార్లింగ్ ప్రభాస్

ప్రభాస్ అంటే బాహుబలి తరువాత వేరు… ముందు వేరు అన్నట్లు మారిపోయింది. బాహుబలి వరకు ప్రభాస్ అంటే అందగాడు. అలాంటి ప్రభాస్ ను సాహో, సలార్, కల్కి సినిమాలో పాత్రలకు తగినట్లు చూపించారు తప్ప,…

ప్రభాస్ అంటే బాహుబలి తరువాత వేరు… ముందు వేరు అన్నట్లు మారిపోయింది. బాహుబలి వరకు ప్రభాస్ అంటే అందగాడు. అలాంటి ప్రభాస్ ను సాహో, సలార్, కల్కి సినిమాలో పాత్రలకు తగినట్లు చూపించారు తప్ప, గ్లామరస్ గా కాదు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ వస్తోంది. ఈ సినిమా ప్రారంభంలో ఫ్యాన్స్ తెగ గోల చేసారు. మారుతితో సినిమా ఏమిటీ అంటూ. కానీ ఇప్పుడు మారుతి సినిమానే కావాలి అనే విధంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఇచ్చారు.

డార్లింగ్ ప్రభాస్ అనే మాదిరిగా కనిపించాడు రాజా సాబ్ గ్లింప్స్ లో. మంచి కలర్ ఫుల్ సూట్ లో, బైక్ మీద వచ్చి, అద్దంలో తనను తాను చూసుకుని దిష్టి తీసుకున్నాడు. ఇదే గ్లింప్స్. అంటే జ‌స్ట్ అందమైన ప్రభాస్ ను చూడబోతున్నారు అనే హింట్ ను ఇచ్చాడు దర్శకుడు మారుతి. అంతకు మించి కథకు లీడ్ ఏమీ ఇవ్వలేదు. వచ్చే ఏడాది సమ్మర్ కు అంటూ విడుదల డేట్ ను ప్రకటించేసారు.

సంక్రాంతి రేస్ లో దిగుతాడేమో ప్రభాస్ అన్న అనుమానాలు తీరిపోయాయి. కల్కి తరువాత వచ్చే ప్రభాస్ సినిమా ఇదే. ఈ ఏడెనిమిది నెలల్లో మరే సినిమా రెడీ కావడం కష్టం. గ్లింప్స్ కు థమన్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఏమీ లేదు. జ‌స్ట్ ఓకె అన్నట్లు వుంది.

3 Replies to “రాజా సాబ్.. మళ్లీ డార్లింగ్ ప్రభాస్”

  1. నవయుగ నిర్మాణ సంస్థ యజమాని రామోజీరావు దీ . పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని . 10-15 వేల కోట్లు దోచుకుంటున్నాడు.

    అందుకే జగన్ re-రివర్స్ ట్రేడింగ్ వేళ్ళునపుడు, పాచ్చి కుట్రలు చేసి . జగన్ ను అధికారం లో నుంచి దించేసాడు

  2. Nijam cheppalante looks balevu. Colour full ga unte bagunnattu kaadu face lo golw kanipinchatla. Chatrapati, darling, mirchi time naati prabhas malli choodalememo. Looks vishayam lo NTR allu arjun modatlo kante ippudu bagunnaru

Comments are closed.