రాజమౌళికి తెలుసు ప్రేక్షకులకు ఏం కావాలో. అందుకే తన గ్రాండియర్, తన స్టయిల్ అందిస్తూనే మాస్ ప్రేక్షకులకు కావాల్సిన మజాను కూడా ఆర్ఆర్ఆర్ లో గట్టిగానే దట్టించినట్లున్నాడు. నాటు..నాటు అంటూ సాగిన పాట థియేటర్లను హోరెత్తిస్తుంది అనడంలో అస్సలు డవుట్ లేదు.
ఇద్దరు టాప్ హీరోలు, పోటీ పడుతూ చేసిన డ్యాన్స్ చాలా ఫ్యాన్స్ కు పైసా వసూల్ కావడానికి. ఆర్ఆర్ఆర్ ను కొన్న బయ్యర్లు ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఆలస్యం అయినా తమ పైసలు సేఫ్ అని అనుకుంటూ వుంటారు. ఇప్పటి వరకు వచ్చిన పబ్లిసిటీ మెటీరియల్ మొత్తం ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూనే వస్తోంది.
యాక్షన్ సీక్వెన్స్ లు కానీ, సాంగ్స్ కానీ, ఎమోషన్లు కానీ అన్నీ ఫుల్ మీల్స్ నే. అసలు కథ, కంటెంట్ ఏమిటి అన్నది ఇంకా క్లారిటీ లేదు. బహుశా విడుదల వరకు వుండకపోచవ్చు. కానీ ఓపెనింగ్ ను భయంకరంగా ఇచ్చే ఫ్యాన్స్ కు కంటెంట్ తో పనిలేదు. ఈ మెటీరియల్ చాలు.
కీరవాణ-చంద్రబోస్ కలిస్తే కొత్తగా ఏం చేసారు అనేకన్నా, క్యాచీగా ఏం చేసారు అనేదే కీలకంగా వుంటుంది. ఆ లైన్ లో నాటు నాటు పాట సూపర్ హిట్టే.