cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రమోషన్ కాదంట.. పంచుకోవడం అంట!

ప్రమోషన్ కాదంట.. పంచుకోవడం అంట!

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి సరికొత్త ప్రచారం మొదలుపెట్టాడు దర్శకుడు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ఎమోషనల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేయబోతూ, ఈరోజు దాన్ని మీడియాకు ప్రదర్శించి చూపించాడు. అయితే దీన్ని ప్రచారం అంటే ఆయన ఒప్పుకోవడం లేదు. రాజమౌళి మాటల్లోనే...

"జనని సాంగ్ అనేది మా సినిమాకు సోల్ లాంటిది. ఇది ప్రమోషన్ కాదు. ప్రమోషన్ చేసేటప్పుడు ఆ హడావుడి, గోల వేరే రకంగా ఉంటుంది. ఇది అందులోకి రాదు. ఇదేంటంటే.. కేవలం మా సినిమా సోల్ (ఆత్మ)ను మీతో పంచుకునే ప్రయత్నం. మా భావాల్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం."

ఈ సందర్భంగా జనని పాట వెనక థీమ్ ను, ఆ ప్రహసనాన్ని కూడా బయటపెట్టాడు జక్కన్న. సినిమా మొత్తాన్ని నడిపించే ఓ కోర్ ఎమోషన్ గా జనని సాంగ్ ను చెప్పుకొచ్చాడు.

"పెద్దన్న (కీరవాణి) దాదాపు 2 నెలలు సినిమాకు రికార్డింగ్ చేశారు. అయినప్పటికీ ఆ కోర్ మెలొడీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. చాలా ఆలోచించి, ప్రయత్నించి ఒక రోజు జనని మెలొడీతో వచ్చారు. దీనికి లిరిక్స్ కూడా ఫస్ట్ టైమ్ పెద్దన్నే రాశారు. రేపు ఈ పాటను అందరికీ చూపించబోతున్నాం."

ఇలా మీడియాకు ఒక రోజు ముందే జనని పాటను చూపించాడు జక్కన్న. ఇక మూవీ ప్రమోషనల్ అప్ డేట్స్ విషయానికొస్తే.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు ప్లాన్ చేశారు. ఇక విడుదలకు కొన్ని రోజుల ముందు టోటల్ టీమ్ తో మీడియా ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేశారు.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!