ఒకప్పుడు యాంగ్రీ యంగ్ హీరో, కానీ ఇప్పుడు యాంగ్రీ సీనియర్ హీరో రాజశేఖర్. సీనియర్ హీరో అంతా ఏదో విధంగా లైమ్ లైట్ లోనే వుంటున్నారు కానీ రాజశేఖర్ మాత్రం అటు ఇటు తడబడుతూ వస్తున్నారు. సరైన సినిమా పడడం లేదు. చేసినా కూడా వర్కవుట్ కావడం లేదు. ఆ మధ్య శేఖర్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు కానీ అది కూడా నిరాశ పర్చింది.
ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు పవన్ సాధినేని డైరక్షన్ లో రాజశేఖర్ ఓ సినిమా ఓకె చేసారు. చాన్నాళ్ల క్రితం సూర్య వెర్సస్ సూర్య లాంటి సినిమా నిర్మించిన మల్కాపురం శివకుమార్ ఈ సినిమాకు నిర్మాత.
ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. పలువురు సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో రాజశేఖర్ మీద దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ కొట్టారు.
సురక్ష్ బ్యానర్ మీద నిర్మించే ఈ సినిమాకు మాన్ స్టర్ అనే టైటిల్ అనే మాంచి పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. తన లక్ష్యసాధనలో అటు గ్యాంగ్ స్టర్స్ ఇటు పోలీసులకు మధ్య చిక్కిన హీరో కథనే సినిమా. ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.