Advertisement

Advertisement


Home > Movies - Movie News

అమెరికాకు రజనీకాంత్... ఏంటి మేటర్?

అమెరికాకు రజనీకాంత్... ఏంటి మేటర్?

ఉన్నట్టుండి సెడన్ గా అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు రజనీకాంత్. ఓవైపు ఆయన అన్నాత్తై సినిమా డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. మరోవైపు కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. 

ఓవైపు ఈ పనులు ఉండగా, సడెన్ గా ఆయన అమెరికా ప్రయాణం ఏంటనే సందేహాలు అందరికీ మొదలయ్యాయి. అయితే ఇది సడెన్ ప్రయాణం కాదు, దాదాపు నెల రోజుల కిందటే ప్లాన్ చేసిన కార్యక్రమం.

రెగ్యులర్ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నారు రజనీకాంత్. అమెరికాలోనే ఆయన ట్రీట్ మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల కిందట ఆయనకు అక్కడే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. 

అప్పట్నుంచి ఆయన ప్రతి ఏటా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా గతేడాదే ఆయన అమెరికా వెళ్లాల్సి ఉన్నప్పటికీ, కరోనా/లాక్ డౌన్ వల్ల ఆలస్యమైంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రస్తుతం ఆమెరికాలోనే ఉన్నాడు. 

ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అతడితో పాటు కుటుంబం మొత్తం అక్కడే ఉంది. ఈసారి రజనీని ధనుష్ దగ్గరుండి చూసుకుంటాడు. రజనీకాంత్ పాటు ఆయన భార్య కూడా అమెరికాకు పయనమయ్యారు. చెన్నై నుంచి దోహాకు, అక్కడ్నుంచి అమెరికాకు కనెక్టింగ్ ఫ్లయిట్ లో యూఎస్ వెళ్తున్నారు.

వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత కొన్నాళ్ల పాటు అమెరికాలోనే రజనీకాంత్ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత ధనుష్ కుటుంబంతో కలిసి అంతా ఒకేసారి చెన్నై వస్తారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?