పోర్న్ వ్యవహారంలో అరెస్టై, నిన్ననే బెయిల్ పొందిన రాజ్ కుంద్రా విషయంలో ఇంకా రకరకాల వార్తలు వస్తున్నాయి. రాజ్ కుంద్రా కు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ రోజు ఆయన విడుదల. అయితే కుంద్రాపై పోలీసులు రకరకాల అభియోగాలు మోపుతున్నారు.
కుంద్రా గత ఏడాదిన్నరగా పోర్న్ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాడని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అంతే కాదు.. ఇంకా కుంద్రా వద్ద అన్ రిలీజ్డ్ పోర్న్ కూడా పట్టుబడిందట. దాని విలువను కూడా పోలీసులు తమ చార్జిషీట్లో పేర్కొన్నారట.
కుంద్రా వద్ద అరెస్టు సమయంలో స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ లలో మొత్తం 119 పోర్న్ వీడియోలున్నాయట. అరెస్టుకు ముందు సమయంలో వాటిని అమ్మే ప్రయత్నంలో ఉన్నాడట రాజ్ కుంద్రా. తొమ్మిది కోట్ల రూపాయలకు వాటిని అమ్మాలని రాజ్ కుంద్రా ప్రయత్నంలో ఉన్నాడట. సరిగ్గా ఆ సమయంలోనే కుంద్రా అరెస్టు జరిగిందట. ఇలా రాజ్ కుంద్రా వద్ద తొమ్మిది కోట్ల రూపాయల అన్ రిలీజ్డ్ ఉందని పోలీసులు పేర్కొన్నారు.
అయితే ఈ కేసులో తనను బలిపశువును చేశారంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు కుంద్రా. తను అమాయకుడినంటూ ఆయన చెప్పుకున్నాడట. ఈ నేపథ్యంలో ఎట్టకేలకూ రెండు నెలల తర్వాత రాజ్ కుంద్రాకు బెయిల్ వచ్చింది. మరి ఈ కేసులో కుంద్రా ఇంకా ఏయే వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తాడో!