పెళ్లిళ్లపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది. జీవితంలో పెళ్లి అనేది ఒకసారే జరిగేదని, కావున బంధుమిత్రుల మధ్య ఆడంబరంగా వివాహాన్ని చేసుకోవాలని కొందరు కోరుకుంటే, మరికొందరు మాత్రం నిరాడంబరంగా సాగాలని తలస్తుంటారు.
పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్ తన విచిత్రమైన కోరికను బయట పెట్టారు. ఈ అందాల తార ఇటీవల ఓ ప్రముఖ వెడ్డింగ్ మ్యాగజైన్ ముఖచిత్రంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెళ్లి ముచ్చట్లు చెప్పారు.
వివాహ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె చెప్పారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని చెప్పారు. జీవితంలో ఓ లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని నెరవేర్చుకునేందుకు నిరంతరం తపించే, శ్రమించే వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతానన్నారు.
పెళ్లి వేడుక విషయానికి వస్తే రకుల్ అభిప్రాయాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. తనకు ఆడంబరాలు ఇష్టం ఉండవన్నారు. ఓ వంద మంది సన్నిహితుల సమక్షంలో బీచ్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలన్నది తన కోరికన్నారు.
సముద్రపు హోరే వేదమంత్రాలుగా భావించి, బీచ్ వేదికగా ఏడడుగులు నడవాలనే రకుల్ అభిమతంపై నెటిజన్లు పాజిటివ్‌గా రియాక్ట్ కావడం విశేషం.