మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది రకుల్. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, నిర్మాత జాకీ భగ్నానీతో మూడు ముళ్లు వేయించుకోబోతోంది. గోవాలో ఈమె పెళ్లికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పుడీ ముద్దుగుమ్మ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
రకుల్-జాకీభగ్నానీ వివాహ ఆహ్వాన పత్రికను ఆహ్లాదకరంగా డిజైన్ చేశారు. కార్డు పైన రకుల్ అండ్ జాకీ అని ప్రింట్ చేశారు. తెలుపు-నీలం మిక్స్ లో కార్డును డిజైన్ చేశారు. గోవాలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట, ఆ ఫ్లేవర్ ను పెళ్లి కార్డులో కూడా చూపించింది. కార్డుపై బీచ్, కొబ్బరిచెట్లు ఉన్నాయి.
21న పెళ్లి చేసుకోబోతోంది రకుల్. కానీ ఆమె ఇంకా గ్యాప్ తీసుకోలేదు. మొన్నటికిమొన్న ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ నిర్వహించింది. తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్ కు కూడా హాజరైంది. ఈ వీకెండ్ నుంచి ఆమె బ్రేక్ తీసుకుంటుంది.
రకుల్-జాకీ తమ పెళ్లికి డిజైనర్లను లాక్ చేశారు. 3 రోజుల పాటు వీళ్ల వివాహ వేడుక జరగనుంది. రోజుకొక డిజైనర్ తయారుచేసిన దుస్తుల్ని వీళ్లు ధరించబోతున్నారు. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా వీళ్లిద్దరికీ పెళ్లి దుస్తులు డిజైన్ చేశారు.
రకుల్-జాకీ స్నేహం గోవాలోనే చిగురించింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. అందుకే సెంటిమెంట్ కొద్దీ గోవాలోనే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత యథావిథిగా షూటింగ్స్ లో పాల్గొంటుంది రకుల్.