Advertisement

Advertisement


Home > Movies - Movie News

కురచ దుస్తులు.. తన భర్తకు ఇష్టమే అంటున్న హీరోయిన్

కురచ దుస్తులు.. తన భర్తకు ఇష్టమే అంటున్న హీరోయిన్

పెళ్లయినా ఏమాత్రం తగ్గడం లేదు రకుల్ ప్రీత్ సింగ్. ఇలా పెళ్లయిందో లేదో అలా తిరిగి తన ప్రొఫెషన్ లోకి వచ్చేసింది. అంతేకాదు, హాట్ హాట్ ఫొటోషూట్స్ తో అదరగొడుతోంది. మరి పెళ్లయిన తర్వాత, ఇలాంటి కురచ దుస్తుల్లో కనిపిస్తే, జాకీకి ఓకేనా..? కళ్లు చెదిరే రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేస్తుంటే ఏం అనడా..? తన భర్త అలాంటి వాడు కాదంటోంది రకుల్.

రకుల్-జాకీ పెళ్లి చేసుకొని ఇవాళ్టికి సరిగ్గా నెల రోజులు. ఈ సందర్భంగా భర్తతో కలిసి చిన్న పార్టీ చేసుకున్న రకుల్.. పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు బయటపెట్టని ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రకుల్.. తన డ్రెస్సింగ్ స్టయిల్ తో జాకీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

పెళ్లయిన తర్వాత వార్డ్ రోబ్ లో మార్పుచేర్పులు జరిగాయా అనే ప్రశ్నకు రకుల్ సూటిగా స్పందించింది. దుస్తుల పద్ధతి మార్చమని భర్త జాకీతో పాటు, అత్తమామలు ఇప్పటివరకు తనను డిమాండ్ చేయలేదని అంటోంది. జాకీతో పాటు, అత్తమామలు చాలా ఓపెన్ మైండెడ్ అని, ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్లు పట్టించుకోరని చెబుతోంది రకుల్.

పెళ్లి చేసుకుంటే, మహిళలు తమ దుస్తుల స్టయిల్ మార్చాలా.. ఇదే పని మగవారు ఎందుకు చేయరు..? పెళ్లయిన సెలబ్రిటీ పురుషుల్ని మీడియా ఈ ప్రశ్న అడుగుతుందా అని రివర్స్ లో ప్రశ్నిస్తోంది రకుల్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?