Advertisement

Advertisement


Home > Movies - Movie News

అందరికీ మ్యాజిక్ టచ్ పోయినట్లుంది

అందరికీ మ్యాజిక్ టచ్ పోయినట్లుంది

శంకర్.. ప్రభుదేవా.. థమన్.. ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల కెరీర్ లో మాగ్జిమమ్, ది బెస్ట్ ఇచ్చిన వాళ్లే. అలాంటి ముగ్గురు కలిసి ఓ పాట అందిస్తున్నారంటే అంచనాలు ఆకాశం రేంజ్ లో వుంటాయి. దాదాపు చాలా అంటే చాలా నెలలుగా ఊరిస్తున్నారు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి పాట వస్తుందని. పాట ముందే లీక్ అయింది. దాంతో కొత్తగా సమ్ థింగ్ వుండాలని, దలేర్ మెహందీ చేత పాడించారు. పాట విడుదలయింది. హీరో అభిమానులకు అంత సంతృప్తి కలగించలేదు. సినిమా అభిమానులను అంతకన్నా ఆనందం మిగల్చలేదు.

శంకర్ వేసే సెట్ ల మ్యాజిక్ టచ్ కాస్త వుంది తప్పితే, ప్రభుదేవా డ్యాన్స్ మూమెంట్స్ కానీ, థమన్ ట్యూన్ కానీ అప్ టు ది మార్క్ లేవని క్లారిటీ ఇచ్చింది సాంగ్. రామ్ చరణ్ లుక్స్ వరకు ఓకె. కలర్ ఫుల్ పిక్చరైజేషన్ వరకు ఓకె. కానీ పాట ట్యూన్ రకరకాలుగా వుంది. క్యాచీగా వున్న చోట్ల పాత వాసనలు గుప్పుమన్నాయి. ఇది థమన్ స్టయిల్ అనుకోవాలి. కొన్ని చోట్ల ట్యూన్ అస్సలు కొరుకుడు పడకుండా సాగింది.

అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ కూడా అలాగే వున్నాయి. కొత్త పదాలు లేదా మంచి పదాలు రాయకుండా, కుర్రకారుకు క్రేజీగా వుంటుందనేమో, పారడైజ్, మార్స్, పబ్ జీ, గూగుల్ ఇలాంటి పదాలు వాడేసారు. శంకర్ ఒకేఒక్కడు సినిమాలో ‘ఉట్టి మీద కూడు.. ఉప్పు చేప తోడు’ సాంగ్ టైప్ మ్యాజిక్ ను క్రియేట్ చేయాలని అనుకున్నట్లుంది. ఆ టైపు బీటును కావాలనుకున్నట్లుంది. కానీ ఆ లిరిక్స్ కు ఈ లిరిక్స్ శత సహస్రం తేడా వుంది. ట్యూన్ కూడా దానికి తగినట్లే వుంది.

పాటలో ఒక్కటే కనిపిస్తోంది. అతి పెద్ద సెట్, దాని కోసం చేసిన ఖర్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?