Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామ్ చరణ్ మార్కులు కొట్టేసాడు

రామ్ చరణ్ మార్కులు కొట్టేసాడు

ఎక్కడ పొగొట్టుకుంటామో..అక్కడే సంపాదించాలి. ఎక్కడ తగ్గితే నెగ్గగలమో తెలుసుకోవాలి. హీరో రామ్ చరణ్ కు ఈ విషయాలు అన్నీ బాగా వంటబట్టాయి. పెళ్లికి ముందు రామ్ చరణ్ వేరు. పెళ్లి తరువాత రామ్ చరణ్ వేరు. టాలీవుడ్ లో వేలు ఎత్తి చూపించుకోని విధమైన ప్రవర్తనను రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తున్న హీరో ఎవరైనా వున్నారా అంటే అది రామ్ చరణ్ నే. 

నిన్నటికి నిన్న జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో హైలైట్ అయింది ఎవరు అంటూ నిర్వాహకుడు బాలయ్యనో, చీఫ్ గెస్ట్ చంద్రబాబునో కాదు. హీరో రామ్ చరణ్. సోషల్ మీడియా అంతా రామ్ చరణ్ గురించే మాట్లాడుతోంది ఇప్పుడు. ఎంత పద్దతి..ఎంత వినయం..ఎంత సంస్కారం అంటూ పొగుడుతోంది.

ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, మహేష్ ఇలా పెద్ద హీరోలు అంతా వారి వారి పనుల వత్తిడి కారణంగా ఈ ఈవెంట్ కు దూరంగా వుంటే, తాను ప్రత్యేకంగా హాజరై రామ్ చరణ్ మార్కులు కొట్టేసాడు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. రామ్ చరణ్-ఎన్టీఆర్ మంచి దోస్త్ లు. కానీ ఆర్ఆర్ఆర్ గ్లోబల్ అవార్డు, ఆస్కార్ అవార్డ్ టైమ్ లో ఎక్కడో ఏదో జరిగింది. బెడిసికొట్టింది. స్నేహం విడివడింది. ఒకప్పుడు పుట్టిన రోజులు కలిసి చేసుకున్న వారు, నిన్న తారక్ బర్త్ డే అయినా చరణ్ జాడ లేదు..ట్విట్టర్ లో ఈయన ఫార్మల్ గా విష్ చేసారు. ఆయన ఫార్మల్ గా సమాధానం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తాత జయంతి ఫంక్షన్ ఊళ్లో జరుగుతున్నా, ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ఇద్దరూ డుమ్మా కొట్టారు. ముందుగా అనుకున్న టూర్ అని ఎన్టీఆర్ కానీ ఆయన సంబంధీకులు కానీ చెప్పొచ్చు. కానీ క్యాన్సిల్ కొట్టలేనంత కార్యక్రమం అయితే కాదు. కానీ ఎన్టీఆర్ అలా చేయలేదు. చంద్రబాబు, బాలయ్యలతో ఎన్టీఆర్ చిరకాలంగా అంటీ ముట్టనట్టుగానే వుంటూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య మెగా క్యాంప్ కు దగ్గరవుతూ వస్తున్నారు. అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అందరూ వచ్చారు కానీ ఎన్టీఆర్ రాలేదు. కరెక్ట్ గా చెప్పాలంటే అందరినీ పిలిచారు కానీ ఎన్టీఆర్ ను కాదు.

ఇలాంటి తరుణంలో రామ్ చరణ్ వచ్చి మార్కులు సంపాదించేసారు.ఎన్టీఆర్ జయంతికి పవన్ వస్తారు అన్నారు. కానీ రాలేదు. రామ్ చరణ్ వచ్చి ఆ లోటు తీర్చేసారు. దీంతో తెలుగుదేశం అనుకుల మీడియా రామ్ చరణ్ ను గాల్లోకి ఎత్తేస్తోంది. ఇదేమంత చిత్రం కాదు. వంద సార్లు అనుకూలంగా వ్యవహరించి, ఒక్కసారి వ్యతిరేకంగా వున్నా చాలు అదే మీడియా భూమిలోకి తొక్కేయడానికి చూస్తుంది. 

ఇదే పవన్ ను, ఇదే చరణ్ తెలుగుదేశానికి కాస్త వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు వుంటుంది మజా. గతంలో పవన్ ను చంద్రబాబు గట్టిగా విమర్శించిన విడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వుండనే వున్నాయి. ఆ వర్గం తీరే అంత. పెడితే పెళ్లి..పెట్టకపోతే శ్రాద్దం అనే టైపు. తమకు అనుకూలంగా వుండి, మా సేవలో తరిస్తే మీకు అండగా వుంటాం.లేదంటే నిత్యం మీడియాలో ఆడేసుకుంటాం అనేదే వాళ్ల పద్దతి.

ఇప్పటికైతే తెలుగుదేశం అనుకూల వర్గానికి చరణ్ బాగా నచ్చేసాడు. ఎన్టీఆర్ రాకపోవడం, చరణ్ రావడం ఇలా రెండు రకాలుగా మార్కులు వచ్చాయి. కానీ ఇది ఇప్పుడు చరణ్-తారక్ ల స్నేహాన్ని మరింత దూరం చేస్తాయనడంతో సందేహం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?