రెడ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ ఉండదా?

కరోనా, లాక్ డౌన్ లాంటివి లేకపోతే ఈపాటికి రెడ్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఇది మూడో రోజు. కానీ సకలం బంద్ అవ్వడం వల్ల అన్ని సినిమాల్లానే రెడ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ…

కరోనా, లాక్ డౌన్ లాంటివి లేకపోతే ఈపాటికి రెడ్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఇది మూడో రోజు. కానీ సకలం బంద్ అవ్వడం వల్ల అన్ని సినిమాల్లానే రెడ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ సినిమా మేటర్ ఇక్కడితో ఆగిపోలేదు. రాబోయే రోజుల్లో కూడా రెడ్ రిలీజ్ అనుమానమే అనేది తాజా రూమర్.

ఈ ప్రచారానికి తగ్గట్టే మరో భారీ ప్రచారం కూడా ఊపందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఏకంగా 20 కోట్లు ఆఫర్ చేసిందట. కాకపోతే థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే, అంటే ఈ లాక్ డౌన్ టైమ్ లోనే స్ట్రీమింగ్ చేయడం కోసం అమెజాన్ ప్రైమ్ ఈ రేటు కోట్ చేసిందని ప్రచారం.

దీంతో రామ్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఇప్పటివరకు చిన్న సినిమాలు మాత్రమే ఈ పని చేశాయి. థియేట్రికల్ రిలీజ్ మానుకొని, డిజిటల్ స్ట్రీమింగ్ కు వెళ్లిపోయాయి. రామ్ లాంటి హీరో సినిమా కూడా ఇలా స్ట్రీమింగ్ కు వెళ్లిపోతే అది పరువు తక్కువ పని అవుతుందంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా యాగీ చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ మేటర్ పై రామ్ స్పందించాడు. కాకపోతే పరోక్షంగా….

ప్రస్తుతం క్వారంటైన్ టైమ్ ఎంజాయ్ చేస్తున్న రామ్.. తనలో ఎలాంటి డైలమా లేదని ప్రకటించాడు. తన అభిమానులు రెడ్ సినిమాను బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేస్తుంటే చూడాలని ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో రెడ్ సినిమాపై వచ్చిన పుకార్లకు చెక్ పడింది. 

ఏప్రిల్ 11 ఏపీలో కొత్త చరిత్ర మొదలైన రోజు

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా క‌న‌గ‌రాజు