Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామ్ సీతారామ్..ఆదిపురుష్ నుంచి మరో వీడియో సాంగ్

రామ్ సీతారామ్..ఆదిపురుష్ నుంచి మరో వీడియో సాంగ్

ఆదిపురుష్ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. మొదటి పాట పెద్ద హిట్టవ్వడంతో, రెండో పాటపై భారీగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి మరీ సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందట రామ్ సీతారామ్ అనే లిరిక్స్ తో సాగే సాంగ్ లాంఛ్ అయింది.

ఈ పాట కోసం వినూత్నంగా, భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు మేకర్స్. ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునేలా.. మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై ఈరోజు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించారు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి దేశవ్యాప్తంగా విడుదలైంది ఈ సాంగ్. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు సంగీతద్వయం సచేత్-పరంపర సంగీతం అందించారు.

తాజాగా విడుదల చేసిన పాటలో ప్రభాస్ లుక్ తో పాటు గ్రాఫిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. లంకలో ఉన్న సీత నుంచి హనుమంతుడు ఆమె గుర్తుగా ఉంగరాన్ని తీసుకొచ్చి రాముడికి ఇవ్వడం, రాముడి కోసం సీత ఎదురుచూపు లాంటి సన్నివేశాలు పాటలో ఆకట్టుకున్నాయి. వీటితో పాటు రాఘవ్-జానకి మధ్య ఉన్న చిన్న సంభాషణను కూడా వీడియోలో విడుదల చేశారు.

ఓం రౌత్ డైరక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇందులో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, కృతి సనన్ ముఖ్యపాత్రలు పోషించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?