Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామబాణం థియేటర్ బర్డెన్ 20 కోట్లు

రామబాణం థియేటర్ బర్డెన్ 20 కోట్లు

గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మించిన సినిమా రామబాణం. విడుదలకు సిద్దం అవుతోందీ. సినిమా లుక్..ప్రొడక్షన్ అంతా బాగానే వుంది కానీ ఒకటే సమస్య. ఓవర్ కే ఓవర్ బడ్జెట్. 

గోపీచంద్ మార్కెట్ కు మించి ఖర్చు చేయించేసారు దర్శకుడు శ్రీవాస్. అలా అంటే ఆయన ఒప్పుకోరు..తప్ప తనది కాదు..వడ్డీలది అంటారు. కానీ నిజానికి కేవలం వడ్డీలు మాత్రమే కాదు, ప్రొడక్షన్ కు కూడా భారీగా ఖర్చు చేయించేసారన్నది యూనిట్ వైపు నుంచి వినిపిస్తున్న సంగతి. ఈ పాయింట్..కౌంటర్ పాయింట్లు ఎలా వున్నా, మొత్తం మీద సినిమాకు యాభై కోట్లు ఖర్చయిపోయింది అన్నది వాస్తవం. 

ఇక్కడే టాలీవుడ్ లో చిన్న జోక్ కూడా వినిపిస్తోంది. కోవిడ్ తరువాత ఖర్చులు తగ్గించడం ఎలా అన్న దాని మీద విపరీతంగా మీటింగ్ లు జరిగాయి. అలాంటి ఓ మీటింగ్ లో ఖర్చులు తగ్గించడం మీద అనర్గళంగా మాట్లాడింది ఈ శ్రీవాస్ నే అంట.

సరే మొత్తం మీద యాభై కోట్లు ఖర్చయింది. ముఫై కోట్లు నాన్ థియేటర్ ఆదాయం వచ్చింది. అది చాలా వరకు అదృష్టం. కానీ ఇంకా ఇరవై కోట్ల రివకరీ కావాలి. అది కూడా థియేటర్ నుంచే రావాలి. అంటే ఆంధ్ర-సీడెడ్-తెలంగాణ-ఓవర్ సీస్ ల నుంచి 20 కోట్ల అమ్మకాలు జరగాలన్నమాట.

పీపుల్స్ మీడియా పేరు, పలుకుబడి మీద అమ్మకాలు జరిగే అవకాశం చాలా వరకు వుంది. కానీ ఒకటే సమస్య. సినిమా హిట్ కొట్టి, బయ్యర్లు గట్టెక్కాలి. ఇరవై కోట్ల మేరకు కలెక్షన్లు రావాలి. అప్పుడు అంతా ఫుల్ హ్యాపీ. అప్పుడే రామబాణం కు తిరుగులేదు అని మరోసారి ప్రూవ్ అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?