Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామారావు డ్యూటీకి కొత్త డేట్

రామారావు డ్యూటీకి కొత్త డేట్

రవితేజ ప్రామిసింగ్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ కి కొత్త డేట్ వచ్చింది. గతంలో ఓ డేట్ ఇచ్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాక వాయిదా వేసారు. ఇప్పుడు కొత్త డేట్ ప్రకటించారు. 

జూలై 29న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు నిర్మాత చెరుకూరి సుధాకర్ ప్రకటించారు. ఈ సినిమా హిట్ రవితేజకు చాలా అవసరం. ఇప్పటికే దారుణమైన ఫ్లాప్ చవిచూసి వున్నాడు. మార్కెట్ నిలబడాలి అంటే  ఈ సినిమా హిట్ కావాల్సిందే. 

ఇప్పటికే ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. అవుట్ పుట్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారు. నిజానికి జూలై 29 డేట్ ఖాబీగా లేదు. ఆ రోజు హిట్ 2 సినిమా విడుదల ప్లాన్ చేసి వుంది. నాని నిర్మించిన ఈ సినిమాలో అడవి శేష్ హీరో.  కానీ జానర్లు తేడా కనుక సమస్య లేదు. 

ఈ సినిమా పై వినిపించిన రూమర్లు ఏవీ నిజం కాదని తేలిపోయింది.. మరో పది రోజులు షూటింగ్ జరుగాల్సి వుంది. అందువల్ల డబ్బులు ఇవ్వలేదని డబ్బింగ్ చెప్పలేదంటూ వచ్చినవి అన్నీ గాలివార్తలే అని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు శరత్ మండవ దర్ళకుడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?