రామబాణం..మాస్..ఫ్యామిలీ టచ్..మెసేజ్

గోపీచంద్..శ్రీవాసు కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మించిన సినిమా రామబాణం. మే ఫస్ట్ వీక్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ప్యాకేజ్…

గోపీచంద్..శ్రీవాసు కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మించిన సినిమా రామబాణం. మే ఫస్ట్ వీక్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ప్యాకేజ్ అన్నట్లు ట్రయిలర్ కట్ చేసారు. 

హీరో గోపీచంద్ మాస్ పాటలు, ఫైట్లు, డైలాగులు అన్నీ బాగా పరిచారు. వీటి మధ్య ఫ్యామిలీ స్టోరీ ని పెర్ ఫెక్ట్ గా బ్లెండ్ చేసినట్లు కనిపిస్తోంది. అదనంగా చిన్న మెసేజ్ కూడా జోడించారు.

కథ చూసినా, సీన్లు చూసినా చాలా భారీ సినిమాల్లో చూసినట్లే వున్నాయి. సినిమా కథ కూడా గతంలో వచ్చిన అనేక భారీ సినిమాల కథలాగే అనిపిస్తోంది. కానీ గమ్మత్తేమిటంటే ఈ మధ్య ఇలాంటి సినిమాలు కాస్త తక్కువ కావడంతో కొత్తగా అనిపించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయినట్ల కనిపిస్తోంది. ట్రయిలర్ కట్ లో ప్రయోగాలకు వెళ్లకుండా ఓ ఫార్మాట్ లో కట్ చేసి, ఓకె అనిపించేసుకున్నారు.

సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. రిచ్ నెస్ కనిపిస్తోంది. గోపీచంద్ చాలా స్టయిల్ గా కనిపించాడు. ట్రయిలర్ లో ఓ మాస్ సాంగ్ కట్ వేసారు. మంచి మంచి లోకేషన్లలో సినిమా షూట్ చేసినట్లు ట్రయిలర్ లో చెప్పేసారు. టోటల్ గా సినిమా మీద ఓ ఐడియాను ఇచ్చి, ఆసక్తిని పెంచడంలో ట్రయిలర్ బాగానే సక్సెస్ అయింది.