ఖిలాడీగా రవితేజ డిస్సపాయింట్ చేసాడు. ఇప్పుడు రామారావ్ ..అన్ డ్యూటీ అంటూ రాబోతున్నాడు. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా రెడీ అయిపోతోంది. దాదాపు పూర్తి కావచ్చింది.
ప్రీ పబ్లిసిటీలో భాగంగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ నిడివి కాస్త ఎక్కువే వుంటుంది. కచ్చితంగా ఫ్యాన్స్ ను అలరించేదిగానే వుంటుంది.
రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.
`రామారావు ఆన్ డ్యూటీ`సినిమా టీజర్ ను మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదల చేస్తారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ న్యూ యాక్షన్ పోస్టర్ విడుదలచేసింది. ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకునేలా సరికొత్త గెటప్‌లో కనిపించారు.
ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శామ్ సిఎస్ అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా క్రాంక్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్.