రామ్ చరణ్ లెదర్ జాకెట్ రేటు ఎంతో తెలుసా?

ఈమధ్య ఓ డిఫరెంట్ ఔట్ ఫిట్ తో కనిపించాడు రామ్ చరణ్. మరీ ముఖ్యంగా అతడు వేసుకున్న లెదర్ జాకెట్ అందర్నీ ఎంతగానో ఆకర్షించింది. దీనిపై ఫ్యాషన్ ప్రియులు, మెగాభిమానులు చిన్నపాటి రీసెర్చ్ చేశారు.…

ఈమధ్య ఓ డిఫరెంట్ ఔట్ ఫిట్ తో కనిపించాడు రామ్ చరణ్. మరీ ముఖ్యంగా అతడు వేసుకున్న లెదర్ జాకెట్ అందర్నీ ఎంతగానో ఆకర్షించింది. దీనిపై ఫ్యాషన్ ప్రియులు, మెగాభిమానులు చిన్నపాటి రీసెర్చ్ చేశారు. ఆ లెదర్ జాకెట్ ఎక్కడ దొరుకుతుంది, దాని రేటు ఎంత అనే అంశాల్ని ఆరా తీశారు. ఆ తర్వాత ఆశ్చర్యపోయారు.

రామ్ చరణ్ వేసుకున్న లెదర్ జాకెట్ ఖరీదు అక్షరాలా 2600 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో దీని రేటు 2 లక్షల రూపాయల పైమాటే. ఈ డిజైనరీ లెదర్ జాకెట్ వేసుకొని ఈమధ్య కనిపించాడు చరణ్. అంతేకాదు.. అదే ఫొటోల్లో చరణ్ వేసుకున్న షూ కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. దీని ఖరీదు అక్షరాలా 40వేల రూపాయలు.

హీరోహీరోయిన్లు ఖరీదైన దుస్తులు వేసుకుంటారు. కాస్ట్ లీ యాక్ససిరీస్ వాడుతుంటారు. కానీ అందరూ ఇలా కనిపించరు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ కు సంబంధించి కొంతమంది హీరోలు సింపుల్ గా ఉండడానికే ఇష్టపడతారు. అయితే అప్పుడప్పుడు ఇలా ఖరీదైన ఔట్ ఫిట్స్ లో మెరుస్తుంటారు.

ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి అలవాటు ఉంది. అయితే వేసుకునే దుస్తుల్లో కంటే, వాడే యాక్ససిరీస్ లో ఎన్టీఆర్ టేస్ట్  కనిపిస్తుంది. అతడు ధరించే వాచ్, షూ చాలా ఖరీదైనవి. 

ఇక హీరోయిన్ల విషయానికొస్తే సమంత దగ్గర ఖరీదైన యాక్ససిరీస్ కలెక్షన్ ఉంది. ఆమె వాడే చెప్పులు, హ్యాండ్ బ్యాగుల రేట్లు లక్షల్లో ఉంటాయి.