రామ్ చరణ్.. నెల రోజులు గ్యాప్

గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అనే డైలాగ్ ఉంది. ఇప్పుడీ డైలాగ్ రామ్ చరణ్ కు అతికినట్టు సరిపోతుంది. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఈ హీరో, ఆ షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాలని అనుకోవడం…

గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అనే డైలాగ్ ఉంది. ఇప్పుడీ డైలాగ్ రామ్ చరణ్ కు అతికినట్టు సరిపోతుంది. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఈ హీరో, ఆ షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాలని అనుకోవడం లేదు. కానీ అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది.

అవును.. ఓ నెల రోజుల పాటు తన సినిమాకు దూరంగా ఉండబోతున్నాడు చరణ్. కమల్ హాసన్ తో ఇండియన్-2 మూవీ చేస్తున్నాడు శంకర్. ఈసారి ఏకంగా నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో రామ్ చరణ్ కు ఆటోమేటిగ్గా గ్యాప్ వచ్చేసింది. 

ఇండియన్-2 షెడ్యూల్ పూర్తయిన తర్వాత తిరిగి శంకర్-చరణ్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో ఆస్కార్ అవార్డుల వేడుకకు చరణ్ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు, బుచ్చిబాబుతో చేయాల్సిన సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా పూర్తిచేయబోతున్నాడు. 

త్వరలోనే తండ్రి కాబోతున్నాడు రామ్ చరణ్. సో.. భార్య ఉపాసనతో క్వాలిటీ టైమ్ గడిపే అవకాశం కూడా చరణ్ కు దక్కింది. ఈ ఏడాది చరణ్ నుంచి సినిమా రావడం లేదు. ఇంకా పేరుపెట్టని, శంకర్ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు.