మరో 3 రోజుల్లో సెట్స్ పైకి రామ్ చరణ్ కొత్త సినిమా

ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్, ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి షిఫ్ట్ అయ్యాడు. శరవేగంగా ఆ కార్యక్రమానికి సంబందించిన తొలి సీజన్ షూటింగ్ ను కూడా పూర్తిచేశాడు. అదే టైమ్ లో రామ్ చరణ్,…

ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్, ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి షిఫ్ట్ అయ్యాడు. శరవేగంగా ఆ కార్యక్రమానికి సంబందించిన తొలి సీజన్ షూటింగ్ ను కూడా పూర్తిచేశాడు. అదే టైమ్ లో రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించి లాంచ్ చేశాడు. 

ఆ తర్వాత కొన్ని రోజులకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా ప్రకటించాడు. ఈ గ్యాప్ లో అయ్యప్ప మాల వేయడంతో పాటు, ఇతర వ్యాపార లావాదేవీలు, వ్యక్తిగత పనులు పూర్తిచేశాడు. ఇప్పుడు చరణ్ సెట్స్ పైకి వెళ్లే టైమ్ వచ్చింది.

మరో 3 రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. తొలి షెడ్యూల్ ను పూణెలో ప్లాన్ చేశారు. దాదాపు 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, హీరోయిన్ కియరా అద్వానీ ఇద్దరూ పాల్గొంటారు. వినయ విధేయ రామ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ను కంపోజ్ చేశాడు. ఈ ఒక్క పాట కోసం 135 మంది మ్యూజీషియన్స్ పనిచేశారు.

నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎందుకంటే, అతడి బ్యానర్ పై ఇది 50వ సినిమా. పాన్ ఇండియా మూవీగా రాబోతోంది శంకర్-చరణ్ సినిమా.