Advertisement

Advertisement


Home > Movies - Movie News

మూడేళ్లకో సినిమా.. స్పీడ్ పెంచు బాసూ

మూడేళ్లకో సినిమా.. స్పీడ్ పెంచు బాసూ

ఓవైపు ప్రభాస్ లాంటి స్టార్స్ వరుసపెట్టి సినిమాలు చేస్తుంటే, మరోవైపు రామ్ చరణ్ మాత్రం నెమ్మదిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఎంత స్లో అంటే, చరణ్ నుంచి మూడేళ్లకు ఒక సినిమా మాత్రమే వస్తోంది.

రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు రామ్ చరణ్. సాధారణంగా రాజమౌళి ఎంత టైమ్ తీసుకుంటాడో అందరికీ తెలిసిందే. పైగా ఆ సినిమా షూటింగ్ టైమ్ లో చరణ్ గాయపడ్డాడు. దీంతో ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే టైమ్ కు మూడేళ్లు గడిచిపోయాయి.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత తను సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతానని ప్రకటించాడు చరణ్. అలా చెప్పిన కొన్ని రోజులకే శంకర్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మేకింగ్ కు చాలా టైమ్ తీసుకునే దర్శకుడిగా ఇతడికి దశాబ్దాల కిందటే పేరుంది.

సో.. గేమ్ ఛేంజర్ పూర్తయ్యేసరికి మళ్లీ మూడేళ్లు గడిచిపోయింది. ఇంకా చెప్పాలంటే గేమ్ ఛేంజర్ ఇంకా సెట్స్ పైనే ఉంది. ఈ సినిమా పూర్తయితే తప్ప బుచ్చిబాబు సినిమా మొదలుపెట్టలేని పరిస్థితి.

రీసెంట్ గా బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు చరణ్. కనీసం ఈ సినిమానైనా తొందరగా పూర్తిచేయాలని, 2025లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బుచ్చిబాబు కూడా తక్కువోడేం కాదు. మొదటి సినిమా మేకింగ్ కే చాలా టైమ్ తీసుకున్నాడు.

అయితే రాజమౌళి, శంకర్ సినిమాల స్థాయిలో బుచ్చిబాబు సినిమా ఏళ్లకు ఏళ్లు పట్టదని అభిమానులు తమనుతాను సర్దిచెప్పుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ గోడు చరణ్ కు వినిపిస్తోందా..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?