అలియా భట్ కూతురు పేరు ఇదే!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ఈ నెల ప్రారంభంలో తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అలియా. తాజాగా తమ కూతురికి ఈ జంట పేరు పెట్టారు.…

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ఈ నెల ప్రారంభంలో తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అలియా. తాజాగా తమ కూతురికి ఈ జంట పేరు పెట్టారు. అలియా-రణబీర్ కూతురు పేరు రహా.

రణబీర్ కపూర్ కు స్పానిష్ ఫుట్ బాల్ క్లబ్ అంటే ఇష్టం. అందుకే కూతురు పేరును జెర్సీపై ముద్రించి, దాన్ని గోడకు అతికించి ఫొటో దిగారు. కూతురు ముఖాన్ని మాత్రం చూపించలేదు.

కూతురుకు రహా అనే పేరును రణబీర్ కపూర్ పెట్టాడని అలియాభట్ తెలిపింది. ఈ పదానికి అర్థాల్ని కూడా ఆమె వివరించింది.

రహా అంటే స్వాహిలీ లో ఆనందం అని అర్థం అంట. ఇక సంస్కృతంలో ఈ పదానికి వంశం, బంగ్లాలో ప్రశాంతత, అరబిక్ లో శాంతి, స్వేచ్ఛ అనే అర్థాలున్నాయని అలియా తెలిపింది.

పాప పుట్టగానే ఈ పేరుకు ఉన్న అర్థాలన్నింటినీ తాము అనుభూతి చెందామని, అలా రహా సార్థకనామధేయురాలు అనిపించుకుందని అలియాభట్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. రహా రాకతో తమ జీవితాలు ఇప్పుడే మొదలైనట్టు అనిపిస్తోందని, మరిన్ని ఆనంద క్షణాలు ముందున్నాయని అంటోంది ఈ హీరోయిన్.