మహేష్ కు ఏ ముద్దు పేరు అంటే ఇష్టం. తన జీవితంలో మహేష్ చేసిన అతిపెద్ద సాహసం ఏంటి? మహేష్ తిన్న అతి వింత వంటకం ఏది? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు, అంతే ఆసక్తికరమైన సమాధానాలిచ్చాడు మహేష్. ఓ మ్యాగజైన్ కు ఫొటోషూట్ ఇచ్చిన మహేష్ బాబు… పనిలోపనిగా ర్యాపిడ్ ఫైర్ లో కూడా పాల్గొన్నాడు.
ఏ ముద్దుపేరును ఎక్కువగా కోరుకుంటారు?
– నాని
అతి పెద్ద భయం?
– దర్శకుల అంచనాల్ని అందుకోలేనేమో అనే భయం
ఇంట్లో మాత్రమే చూపించాలనుకునే హిడెన్ టాలెంట్ ఏంటి?
– నేను చాలా ఫన్నీ పర్సన్. మా పిల్లలు, భార్యకు ఆ విషయం తెలుసు.
జీవితంలో చేసిన అతిపెద్ద అడ్వెంచర్?
– న్యూజిలాండ్ లో బంగీ జంప్ చేశాను
ఎక్కువగా వాడే పదం?
– బ్యూటిఫుల్ అనే పదం ఎక్కువగా వాడుతుంటాను
ఈమధ్య కాలంలో ఏ సినిమా చూసి ఏడ్చారు?
– లయన్ కింగ్. ఆ సినిమా చూసిన ప్రతిసారి కన్నీళ్లు వస్తాయి
దర్శకుడిగా మారితే, మీరు నటించిన ఏ సినిమాల్ని మళ్లీ తీయాలనుకుంటారు?
– నేను దర్శకుడిగా మారితే ఒక్కడు సినిమాను మళ్లీ తీస్తా
ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా?
– మా నాన్న కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ.
జీవితంలో మీరు తిన్న వింత వంటకం ఏది?
– ఓసారి థాయిలాండ్ లో ఏదో సముద్ర వంటకం తిన్నాను. దాని పేరు కూడా గుర్తులేదు. నేను తిన్న వింత వంటకం అదే. అది నాకు అస్సలు నచ్చలేదు.
ఫ్యామిలీతో డిన్నర్ చేయాలంటే ఏ రెస్టారెంట్ కు వెళ్తారు?
– హైదరాబాద్ లోనైతే ఐటీసీలో దక్షిణ్ హోటల్ కు వెళ్తాం. అక్కడ సౌతిండియా భోజనం చాలా బాగుంటుంది. మా అందరికీ ఇష్టం. విదేశాల్లో అయితే నోబు రెస్టారెంట్లకు వెళ్లడానికి ఇష్టపడతాం.
ఓ పడవ కొనుక్కుంటే దానికి ఏం పేరు పెట్టుకుంటారు?
– నాకు పడవలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే సముద్ర ప్రయాణం నాకు పడదు. నేను హ్యాండిల్ చేయలేను
బిజీ షూటింగ్స్ మధ్య ఎలా రిలాక్స్ అవుతారు?
– కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తాను. ఒత్తిడిని జయించడానికి, రిలాక్స్ అవ్వడానికి నాకు తెలిసిన ఏకైక మార్గం అదే.
పర్యటనల్లో బాగా ఇష్టపడే అంశం ఏంటి?
– రకరకాల వంటకాలు తింటాను. అదే నాకు ఇష్టమైన పార్ట్.