ఇది దేవర మేటర్ కాదు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా సంగతి. ఆగస్ట్ నుంచి ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు తారక్. తాజాగా దీనికి సంబంధించి ప్రకటన కూడా వచ్చింది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడీ ప్రాజెక్టుకు మరో ఎట్రాక్షన్ వచ్చి చేరింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్నారట. ఎన్టీఆర్-రష్మికది ఫ్రెష్ కాంబినేషన్. పైగా రష్మిక వస్తే, ఈ ప్రాజెక్టుకు మరింత వెయిట్ పెరుగుతుంది. ఎందుకంటే, ఓ పాన్ ఇండియా స్టార్ కు పాన్ ఇండియా హీరోయిన్ యాడ్ అవుతుంది కదా.0
పుష్ప, యానిమల్ సినిమాలతో రష్మిక రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 సినిమా చేస్తోంది. దీంతో పాటు.. కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ మూవీస్ కూడా సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలకు తోడుగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో నటించేందుకు ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది.
రష్మిక నటిస్తున్న రెయిన్ బో సినిమా ఆగిపోయినట్టు వార్తలొస్తున్నాయి. అటు గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా దాదాపు కొలిక్కి వస్తోంది. సో.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు కాల్షీట్లు కేటాయించడానికి ఆమెకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎటొచ్చి అనుకున్న టైమ్ కు ఈ సినిమా సెట్స్ పైకి రావాలంతే.