రష్మిక వైన్ తాగుతుందనే విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టింది. తందూరి పోర్క్ తింటూ వైన్ తాగితే స్వర్గం కనిపిస్తుందని గతంలో తెలిపింది. మరి రష్మిక సిగరెట్లు తాగుతుందా..? తాగితే రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతుంది? స్వయంగా రష్మికకు ఎదురైన ప్రశ్న ఇది.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నెటిజన్లతో టచ్ లోకి వస్తుంటారు హీరోయిన్లు. రష్మిక కూడా ఇలానే లైవ్ లోకొచ్చింది. ఏ ప్రశ్న అయినా అడగండి సమాధానం చెబుతానంటూ ఊరించింది. దీంతో ఓ ఆకతాయి నెటిజన్, “రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతావ్” అంటూ ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు రష్మిక సీరియస్ అవ్వలేదు. తను సిగరెట్లు తాగనని ఓపిగ్గా సమాధానం ఇచ్చింది. అంతేకాదు, తన చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్ తాగినా తనకు నచ్చదని అంటోంది. దీంతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా షేర్ చేసింది ఈ కన్నడ బ్యూటీ.
రష్మికకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 6 భాషలు వచ్చంట. 6 భాషల్లో తను మాట్లాడగలనని చెబుతోంది. ఇక హీరోయిన్ కు ఫిట్ నెస్ ముఖ్యమా ఎక్స్ ప్రెషన్ ముఖ్యమా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. రెండూ కాదని, కష్టపడి పనిచేయడం ముఖ్యమని తెలిపింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. బన్నీతో డాన్స్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశానంటోంది. తను నిత్యం పాజిటివ్ గా ఉండడానికి కారణం, తన తల్లిదండ్రులు, చెల్లెలు, ఫ్రెండ్స్ మాత్రమే అంటున్న ఈ చిన్నది.. ప్రస్తుతం బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తోంది.