cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరో జానర్: మాస్ రాజాకు కలిసొస్తుందా?

మరో జానర్: మాస్ రాజాకు కలిసొస్తుందా?

జానర్లు మారుస్తున్నా సక్సెస్ మాత్రం అందడం లేదు రవితేజకి. ప్రతి సినిమాపై అంతోఇంతో అంచనాలు ఉంటున్నాయి. థియేటర్లలోకి వచ్చేసరికి మాత్రం తుస్సుమంటున్నాయి. ఈసారి ఏకంగా సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ జానర్ ట్రై చేస్తున్నాడు రవి. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అతడు చేస్తున్న సినిమా డిస్కోరాజా. కొద్దిసేపటి కిందట టీజర్ రిలీజ్ చేశారు.

రవితేజ మార్కెట్ తో సంబంధం లేకుండా సినిమాపై భారీగా ఖర్చుచేశారనే విషయం టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. మరీ ముఖ్యంగా గతంలో రవితేజతో నేలటిక్కెట్ లాంటి డిజాస్టర్ తీసిన రామ్ తళ్లూరి, పాత గాయాల్ని మరిచిపోయి మరీ డిస్కోరాజా కోసం భారీగా పెట్టుబడులు పెట్టినట్టున్నారు.

ఎంతో శ్రమ, ఖర్చుతో ఐస్ ల్యాండ్ లో షూట్ తీసిన సన్నివేశాలు టోటల్ సినిమాకే హైలెట్ అని యూనిట్ చెబుతోంది. ఆ సన్నివేశాల్లో కొన్ని టీజర్ లో చూపించారు. ఇక అన్నపూర్ణ స్టుడియోలో వేసిన ల్యాబ్ సెట్ కు సంబంధించిన సీన్స్ కూడా వీడియోలో ఉన్నాయి. రెట్రో గెటప్ లో రవితేజనైతే చూపించారు కానీ, అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, కథ ఏంటనే విషయాల్ని కొంచెం కూడా టీజర్ లో చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.

ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఊపుమీదున్న తమన్, ఈ టీజర్ కు కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయబోతున్నారు.

 


×