Advertisement

Advertisement


Home > Movies - Movie News

రవితేజ-ఖరీదైన పాట

రవితేజ-ఖరీదైన పాట

ఇవ్వాళ, రేపు సమ్ థింగ్ స్పెషల్ వుంటేనే ఆడియన్స్ సినిమాను లైక్ చేస్తున్నారు. అందుకే నిర్మాతలు, దర్శకులు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడడం లేదు కూడా. రవితేజ హీరోగా, ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న రామ్ తాళ్లూరి సినిమా డిస్కోరాజా. ఈ టైటిల్ కు తగినట్లు, ఓ మాంచి పాట వుండాలని ప్లాన్ చేసారు. ఆ మేరకు మూడు నాలుగు కోట్ల ఖర్చుతో ఓ పాటను షూట్ చేసారు. ఆ పాట లోని సీన్లు కట్ చేసి, రవితేజ మార్క్ డైలాగులు యాడ్ చేసి ప్రీక్  విడియో వదిలారు.

రవితేజ ఎలా వుంటే అతని ఫ్యాన్స్ కు నచ్చుతుందో, రవితేజ కు ఏ స్టయిల్స్ అయితే నప్పుతాయో అలాంటి స్టయిల్స్ జోడించి ఈ సాంగ్ ను తయారుచేసినట్లు తెలుస్తోంది. గత సినిమాలతో చూసుకుంటే రవితేజ స్టయిల్ గా, అందంగా కనిపిస్తున్నాడు.  థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగా సెట్ అయింది. కార్తీక్ ఘట్టమనేని షాట్, ఫ్రేమ్ అరేంజ్ మెంట్ కూడా బాగున్నాయి.

సినిమాకు ఈ సాంగ్ ప్లస్ అవుతుందని మేకర్లు కూడా నమ్ముతున్నట్లుంది. అందుకే దీనికి కాస్త గట్టిగా ప్రచారం చేస్తున్నారు. బప్పీలహరి చాన్నాళ్ల తరువాత తెలుగు పాట పాడడం, దానికి రవితేజ గొంతు కలపడం ఇవన్నీ పాటకు అదనపు హంగులు కావచ్చు. డిస్కోరాజా ఈ నెల 24న థియేటర్లలోకి వస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?