ఒకే రీమేక్ ఆఫర్ ఒకే హీరోకు 2 సార్లు

సాధారణంగా ఓ సినిమా ఆఫర్ ఏ హీరో దగ్గరకైనా ఒకసారే వస్తుంది. అతడు నో అంటే, మళ్లీ అతడి కాంపౌండ్ లోకి ఆ కథ రాదు. కానీ మిస్టర్ బచ్చన్ విషయంలో మాత్రం దీనికి…

సాధారణంగా ఓ సినిమా ఆఫర్ ఏ హీరో దగ్గరకైనా ఒకసారే వస్తుంది. అతడు నో అంటే, మళ్లీ అతడి కాంపౌండ్ లోకి ఆ కథ రాదు. కానీ మిస్టర్ బచ్చన్ విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. రవితేజ ఓసారి రిజెక్ట్ చేసిన కథ ఇది. తిరిగి ఇదే కథను రెండోసారి ఓకే చేశాడు.

“రెయిడ్ సినిమా రీమేక్ ఆఫర్ గతంలోనే ఓసారి నా దగ్గరకు వచ్చింది. ఓ దర్శకుడు నన్ను అడిగాడు, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. సినిమా నచ్చింది కానీ డ్రై గా, సీరియస్ గా ఉంది కాబట్టి నో చెప్పాను. ఎప్పుడైతే హరీశ్ శంకర్ ఎంటరయ్యాడో అప్పుడు ఓకే చెప్పాను. ఎందుకంటే, అతడు రీమేక్స్ ను అద్భుతంగా మార్చేయగలడు. గతంలో అది ప్రూవ్ అయింది. అందుకే ఓకే చెప్పాను.”

ఒరిజినల్ సినిమాకు హరీశ్ శంకర్ పూర్తిస్థాయిలో మార్పుచేర్పులు చేశాడని అంటున్నాడు రవితేజ. కథ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, సీన్స్ లో చాలా మార్పులు జరిగాయంటున్నాడు. థియేటర్లలో మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత రెయిడ్ సినిమాను ప్రేక్షకులు మరిచిపోతారని అంటున్నాడు.

మిస్టర్ బచ్చన్ రిలీజైన తర్వాత, దీన్ని మరోసారి హిందీలో రీమేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాడు రవితేజ. డ్రైగా ఉన్న కథ-స్క్రీన్ ప్లేను పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా మార్చేశాడట హరీశ్. సినిమాలో 60 శాతం వినోదం ఉంటుందని, ఫస్టాఫ్ హిలేరియస్ గా ఉంటుందని అంటున్నాడు.

5 Replies to “ఒకే రీమేక్ ఆఫర్ ఒకే హీరోకు 2 సార్లు”

Comments are closed.